Ind W vs Eng W T20 : మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు చేతిలో భారత్ ఓడింది. 198 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన టీమ్ఇండియా మహిళల జట్టు, 20 ఓవర్లలో 159 - 6కే పరిమిమైంది. దీంతో తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియాలో ఓపెనర్ షఫాలీ వర్మ (52 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం వల్ల టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ 3, సారా గ్లెన్, ఫ్రెయా కెంప్, నాట్ సీవర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
-
Starting strong!!! 💪
— England Cricket (@englandcricket) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A great night at the Wankhede 😍#EnglandCricket pic.twitter.com/OiPLTyIPv9
">Starting strong!!! 💪
— England Cricket (@englandcricket) December 6, 2023
A great night at the Wankhede 😍#EnglandCricket pic.twitter.com/OiPLTyIPv9Starting strong!!! 💪
— England Cricket (@englandcricket) December 6, 2023
A great night at the Wankhede 😍#EnglandCricket pic.twitter.com/OiPLTyIPv9
భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు పవర్ ప్లేలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (6), జెమిమా రోడ్రిగ్స్ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ స్థితిలో మరో ఓపెనర్ షఫాలీతో కలిసి కెప్టెన్ హర్మన్, ఇన్నింగ్స్‌ను గాడీలో పెట్టింది. వీళ్లు క్రీజులో ఉండగా భారత్, 10 ఓవర్లకు 82-2తో నిలిచింది. ఈ దశలో టీమ్ఇండియా పుంజుకున్నట్లు అనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే సోఫీ, హర్మన్‌ను పెవిలియన్ చేర్చి షాకిచ్చింది. తర్వాత వచ్చిన రిచా ఘేష్ కూడా వేగంగా అడే ప్రయత్నం చేసింది. ఇక స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో టీమ్ఇండియా ఓటమి దాదాపు ఖాయమైంది.
-
ICYMI!
— BCCI Women (@BCCIWomen) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shafali Verma scored a fine 52(42) with some cracking shots on display 🔝
WATCH 🎥🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/DuJgZAO3kC
">ICYMI!
— BCCI Women (@BCCIWomen) December 6, 2023
Shafali Verma scored a fine 52(42) with some cracking shots on display 🔝
WATCH 🎥🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/DuJgZAO3kCICYMI!
— BCCI Women (@BCCIWomen) December 6, 2023
Shafali Verma scored a fine 52(42) with some cracking shots on display 🔝
WATCH 🎥🔽 #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/DuJgZAO3kC
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన, ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డేనియల్ వ్యాట్ (75 పరుగులు), నాట్ సీవర్ (77 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు, టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్ఉంచింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3, శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టారు.
wpl auction 2023 : కెప్టెన్‌ను దాటేసిన స్మృతి మంధాన.. రూ. కోట్లు పలికిన ప్లేయర్లు వీళ్లే