ETV Bharat / sports

వెస్టిండీస్​ సిరీస్​కు భారత జట్టు.. కుల్దీప్ రీఎంట్రీ, బిష్ణోయ్​కు పిలుపు

IND vs WI Series 2022: వెస్టిండీస్​తో సిరీస్​తో కుల్దీప్ యాదవ్​ పునరాగమనం చేయనున్నాడు. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్​కు కూడా టీ20 సిరీస్​ కోసం పిలుపొచ్చింది. ఫిబ్రవరి 6 నుంచి 20వ తేదీ మధ్య ఈ మ్యాచులు జరగనున్నాయి.

IND vs WI Series 2022
IND vs WI Series 2022
author img

By

Published : Jan 26, 2022, 10:31 PM IST

Updated : Jan 27, 2022, 11:53 AM IST

ముంబయి: వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ బుధవారం భారత జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. రాజస్థాన్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపక్‌ హుడాకు వన్డే పిలుపు అందింది. దక్షిణాఫ్రికాలో స్పిన్నర్ల వైఫల్యం నేపథ్యంలో 21 ఏళ్ల లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు.

team india west indies tour
బీసీసీఐ ట్వీట్

మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల ఆల్‌రౌండర్‌ జడేజా సెలక్షన్‌కు అందుబాటులో లేడు. హార్దిక్‌ పాండ్య కూడా ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలుస్తోంది. ఫాస్ట్‌బౌలర్లు బుమ్రా, షమిలకు విశ్రాంతి కల్పించారు. కేఎల్‌ రాహుల్‌ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉంటాడు. భువనేశ్వర్‌కు టీ20 జట్టులో మాత్రమే స్థానం లభించింది. అశ్విన్‌ ఏ జట్టులోనూ లేడు.

వెస్టిండీస్‌తో వన్డేలు ఫిబ్రవరి 6, 9, 11న అహ్మదాబాద్‌లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.

భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌, ధావన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, శ్రేయస్‌, దీపక్‌ హుడా, పంత్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌

భారత టీ20 జట్టు: రోహిత్‌, రాహుల్‌, కిషన్‌, కోహ్లి, శ్రేయస్‌, సూర్యకుమార్‌, పంత్‌, వెంకటేశ్‌, దీపక్‌ చాహర్‌, శార్దూల్‌, బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, సుందర్‌, సిరాజ్‌, భువనేశ్వర్‌, అవేష్‌, హర్షల్‌

వెస్టిండీస్​ క్రికెట్ బోర్డు కూడా భారత్​తో మూడు వన్డేల సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది. సీనియర్​ బౌలర్​ కీమర్​ రోచ్​ తిరిగి జట్టులోకి వచ్చాడు. బ్రాండన్​ కింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఈ టీమ్​కు కీరన్​ పొలార్డ్​ కెప్టెన్​గా వ్యవహరిస్తాడు​.

జట్టు: కీరన్​ పొలార్డ్​, ఫాబియన్​ అలెన్​, న్కుృమా బోన్నర్​, డారెన్​ బ్రావో, షమర్​ బ్ర్రూక్స్​, జాసన్ హోల్డర్​, షాయ్​ హోప్​, అకేల్​ హోసేన్​, అల్జారీ జోసెప్​, బ్రాండన్​ కింగ్​, నికోలస్​ పూరన్​, కీమర్​ రోచ్​, రొమారియో షెపర్డ్​, ఓడియన్​ స్మిత్​, హేడెన్​ వాల్ష్​ జూనియర్​.

ఇదీ చూడండి: 'కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడం.. భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ'

Last Updated : Jan 27, 2022, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.