ETV Bharat / sports

IND vs SA: చేజారిన సిరీస్​.. బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమా? - భారత్ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్

IND vs SA: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ దేశాల్లో అదరగొట్టిన మన జట్టు.. సఫారీ సేనపై మాత్రం ఎందుకు ఆధిపత్యం చెలాయించలేకపోయింది? ఎక్కడ విఫలమైంది? ఇంతకీ కారణమేంటి?

IND vs SA
భారత్ టెస్టు సిరీస్
author img

By

Published : Jan 15, 2022, 6:34 AM IST

Updated : Jan 15, 2022, 9:09 AM IST

IND vs SA: వార్నర్‌, లబుషేన్‌, స్మిత్‌, కమిన్స్‌, స్టార్క్‌ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న ఆస్ట్రేలియాపై దాని సొంతగడ్డపైనే చారిత్రక సిరీస్‌ విజయం. రూట్‌, మలన్‌, బెయిర్‌స్టో, మొయిన్‌ అలీ, అండర్సన్‌, వోక్స్‌ వంటి ఉత్తమ క్రికెటర్లున్న ఇంగ్లాండ్‌ జట్టుపై ప్రత్యర్థి దేశంలో పైచేయి. కానీ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో బలహీనంగా కనిపించిన దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మాత్రం నిరాశ కలిగించే ఓటమి.

తొలి టెస్టు గెలిచి..

తొలి టెస్టు గెలిచి.. చరిత్ర సృష్టించే అవకాశాలను మెరుగు పర్చుకున్న తర్వాత.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమితో సిరీస్‌ దూరం.. ఇదీ ప్రస్తుత టీమ్‌ఇండియా కథ. కంగారూ గడ్డపై, ఇంగ్లిష్‌ దేశంలో అదరగొట్టిన మన జట్టు.. సఫారీ సేనపై మాత్రం ఎందుకు ఆధిపత్యం చలాయించలేకపోయింది? ఎక్కడ విఫలమైంది?

కోహ్లి సారథ్యంలో ఆస్ట్రేలియాలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌ విజయాలు.. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌లో ఆధిక్యం! దీంతో దక్షిణాఫ్రికాలో ఈసారి సుదీర్ఘ ఫార్మాట్లో సిరీస్‌ కల నెరవేరుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇటు అన్ని రంగాల్లో బలంగా ఉన్న భారత్‌.. అటు బ్యాటింగ్‌లో ఎల్గర్‌, బౌలింగ్‌లో ఎంగిడి, రబాడ తప్ప ఇతర ఆటగాళ్లపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితుల్లో సఫారీ జట్టు. ఇంకేముంది సిరీస్‌ దక్కుతుందనే అభిప్రాయాలను నిజం చేసేలా.. తొలి మ్యాచ్‌లో విజయం. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. చివరకు సిరీస్‌ చేజారింది.

అందుకు ప్రధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే. ఇదంతా స్వయంకృతాపరాధమే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ సిరీస్‌ల్లో గొప్ప పోరాట పటిమతో అద్భుత ప్రదర్శన చేసిన మన బ్యాటర్లు.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో తేలిపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్‌ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు రాణించడంతోనే తొలి టెస్టులో ఆ గెలుపైనా దక్కింది. మన బౌలర్లు ఎప్పటిలాగే ఉత్తమ ప్రదర్శనే చేశారు. కానీ కాపాడుకునేందుకు మంచి స్కోరు లేకపోతే వాళ్లు మాత్రం ఏం చేయగలరు.

మారడం లేదు..

"2018 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే 250కి పైగా పరుగులు చేసింది. అందుకే మూడు టెస్టుల్లోనూ మన బౌలర్లు 20 వికెట్లు తీసినా సిరీస్‌ ఓటమే మిగిలింది. అక్కడ ఆడినప్పుడు అదనపు బ్యాటర్‌ ఉండాల్సిందే".. ఇదీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ చేసిన ట్వీట్‌. మళ్లీ పాత కథే పునరావృతమైందని తాజాగా సిరీస్‌ ముగిశాక అతను మరో ట్వీట్‌ చేశాడు.

ఈ సిరీస్‌ ఓటమికి బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధానం కారణమని, దానిపై దృష్టి సారిస్తామని కెప్టెన్‌ కోహ్లి కూడా అన్నాడు. అందరూ చెబుతున్నట్లు బ్యాటింగే జట్టును వెనక్కి లాగింది. ఈ సిరీస్‌లోనూ భారత్‌ కేవలం ఒక్క ఇన్నింగ్స్‌లో మాత్రమే 270కి పైగా పరుగులు సాధించింది. ప్రత్యర్థి జట్టులో ఎంగిడి, రబాడ మినహాయిస్తే మిగతా వాళ్లు అనుభవం లేని బౌలర్లే. కానీ వాళ్లను ఎదుర్కొనేందుకు మన బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జాన్సన్‌ బౌలింగ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

కొంతకాలంగా ఫామ్‌ లేమితో సతమవుతున్న కోహ్లి.. చివరి టెస్టుతో గాడిన పడ్డట్లు కనిపించాడు. అతడు సిరీస్‌లో 161 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ (226) భారత జట్టులో టాప్‌ స్కోరర్‌. పంత్‌ ఆఖరి టెస్టులో శతకంతో విమర్శకులకు సమాధానం చెప్పాడు. దీంతో ఇప్పుడందరి వేళ్లూ సీనియర్‌ బ్యాటర్లు పుజారా (3 టెస్టుల్లో 124), రహానే (136)లనే చూపిస్తున్నాయి. రెండేళ్లుగా తడబడుతున్న ఈ ఇద్దరు.. ఈ సిరీస్‌లోనూ నిరాశపరిచారు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెరో అర్ధశతకం మినహా దారుణంగా విఫలమయ్యారు.

ఆ మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకోవాల్సింది పోయి క్రీజులో కుదురుకున్నాక పెవిలియన్‌ చేరి ఇబ్బందుల్లోకి నెట్టారు. ఎంతో అనుభవమున్న ఈ బ్యాటర్లు.. క్రీజులో ఆత్మవిశ్వాసంతో నిలబడనే లేదు. అసౌకర్యంగా కదులుతూ.. పేలవ షాట్లతో పెవిలియన్‌ చేరారు.

ఇప్పటికే ఎన్నో అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోని ఈ జోడీపై ఇక వేటు తప్పకపోవచ్చు. కోహ్లి మాటలు చూస్తుంటే అదే జరిగేలా ఉంది. ఇద్దరినీ ఒకేసారి పక్కన పెట్టే అవకాశాలనూ కొట్టిపారేయలేం.

ఇదీ చూడండి: రహానేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

Last Updated : Jan 15, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.