IND vs SA: పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో.. బౌలర్ నో బాల్ వేసినప్పుడు 'ఫ్రీ హిట్' అవకాశం ఉంటుంది. అంటే బౌలర్ ఎక్స్ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే 'ఫ్రీ హిట్' విధానాన్ని టెస్టు క్రికెట్లోనూ తీసుకురావాలని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ సూచించాడు.
" టెస్ట్ క్రికెట్లో బౌలర్ నో బాల్ వేస్తే ఫ్రీ హిట్ ఇవ్వాలి. ఇది కచ్చితంగా బ్యాటింగ్ చేసే బౌలర్లకు ఉపయోగపడుతుంది. ఓవర్‌కు 7/8 బంతులు, ఒక్కోసారి 9బంతులు కూడా చాశాం." అని స్టెయిన్ అన్నాడు.
'ముఖ్యంగా బౌలర్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. వాళ్లు టాప్ క్లాస్ పేసర్ల బౌలింగ్‌ను తట్టుకోవాల్సిఉంటుంది.. ఈ క్రమంలో బౌలర్లకు ఆరు బంతులు సరిపోవు'అని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. భారత్- దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న క్రమంలో స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా బౌలర్ బుమ్రా అద్భుత ప్రదర్శన(5/42)పై ప్రశంసలు కురిపించాడు.
ఫ్రీ హిట్ అంటే..?
పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో.. బౌలర్ నో బాల్ వేసినప్పుడు 'ఫ్రీ హిట్' అవకాశం ఉంటుంది. అంటే బౌలర్ ఎక్స్ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ బంతిని బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్నప్పుడు కేవలం రనౌట్ అయితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు.
కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో ఇలా కాదు. బౌలర్ చేసిన తప్పిదానికి బ్యాట్స్‌మన్ ఇబ్బందులు పడే సందర్భాలు ఎదురవుతాయి. ఒకవేళ బౌలర్ నోబాల్ వేస్తే.. ఆ బంతిని లెక్కలోకి పరిగణించకుండా ఎక్స్ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్ట్రా బంతికి ఔట్ అయినా బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు చేరాల్సిందే.
ఇదీ చూడండి: 'పంత్‌కు కాస్త భరోసా ఇస్తే చెలరేగి ఆడతాడు'