ETV Bharat / sports

సెంచరీతో అదరగొట్టిన పంత్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే? - పంత్ సెంచరీ

IND vs SA 3rd Test Day 3: ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికాకు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమ్​ఇండియా. పంత్​ శతకంతో అదరగొట్టాడు.

rishabh pant
రిషభ్ పంత్
author img

By

Published : Jan 13, 2022, 6:58 PM IST

Updated : Jan 13, 2022, 7:47 PM IST

IND vs SA 3rd Test Day 3: సిరీస్‌ నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100*) శతకంతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికాకు 212 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది టీమ్‌ఇండియా. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 198 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ 13 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్‌ 211 పరుగుల లీడ్‌ సాధించింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 57/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు (పుజారా, రహానె) కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్‌ పంత్‌ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యం (94) నెలకొల్పాడు. అయితే కోహ్లీతో సహా ఓ వైపు వికెట్లు పడుతున్నా.. పంత్‌ ఆఖరి వరకు నిలకడగా రాణించాడు. సఫారీ జట్టు బౌలర్ల దెబ్బకు మిగతా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. కేఎల్‌ రాహుల్ 10, మయాంక్‌ అగర్వాల్ 7, పుజారా 9, రహానె 1, అశ్విన్‌ 7, శార్దూల్‌ ఠాకూర్‌ 5 పరుగులు చేశారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్​ ఆడిన భారత్​ 223 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 210 పరుగులు చేసింది.

భారత్ బ్యాటర్లు మొత్తం అలానే..

మూడో టెస్టులో భాగంగా రెండు ఇన్నింగ్స్​లలో కలిపి టీమ్​ఇండియా బ్యాటర్లందరూ క్యాచ్ ఔట్ కావడం అయ్యారు. ఇలా జరగడం ఇదే తొలిసారి. గతంలో ఓ టెస్టులో 19 మంది క్యాచ్ ఔట్ అవడం ఐదు సార్లు జరిగింది.

ఇదీ చదవండి:

పంత్ హాఫ్​ సెంచరీ.. 143 పరుగుల అధిక్యంలో భారత్

Last Updated : Jan 13, 2022, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.