IND Vs SA 1st ODI Records : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జొహనెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు తమిళనాడు యువ ఆటగాడు సాయి సుదర్శన్. అయితే అరంగేట్రం మ్యాచ్‌లోనే అతడు అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో యంగ్ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు సుదర్శన్. 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి టీమ్ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.
నాలుగో ఆటగాడిగా
Sai Sudharsan Record : అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ సాధించిన టీమ్ఇండియా నాలుగో ఆటగాడిగా రికార్డుకెక్కాడు. రాబిన్ ఉతప్ప (2006లో ఇంగ్లాండ్‌పై 86 పరుగులు), కేఎల్ రాహుల్ (2016లో జింబాబ్వేపై 100 నాటౌట్), ఫయాజ్ ఫజల్ (2016లో జింబాబ్వేపై 55 నాటౌట్) తర్వాత అరంగేట్రంలో హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు, వన్డే డెబ్యూలో ఓపెనర్‌గా 50 ప్లస్ స్కోర్ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2022 ఐపీఎల్ సీజన్‌తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి 22 ఏళ్ల సాయి సుదర్శన్ అద్భుతంగా రాణించాడు. రెండు సీజన్లలో 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు హాఫ్‌సెంచరీల సాయంతో 46.09 సగటున 507 పరుగులు సాధించాడు.
కేఎల్ రాహుల్ ఘనత
Kl Rahul Record Against South Africa : సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. తొలి వన్డేలో సఫారీలను చిత్తుగా ఓడించడం ద్వారా పింక్ వన్డే (సౌతాఫ్రికా ఆటగాళ్లు పింక్ కలర్ జెర్సీలతో ఆడే మ్యాచ్‌లు) గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఏ భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాలో పింక్ వన్డే గెలవలేదు.
-
CAPTAIN KL RAHUL CREATED HISTORY...!!!!
— Johns. (@CricCrazyJohns) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- He becomes the first Indian captain to win the Pink ODI match in South Africa. 🇮🇳 pic.twitter.com/hGpMQmUDYD
">CAPTAIN KL RAHUL CREATED HISTORY...!!!!
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
- He becomes the first Indian captain to win the Pink ODI match in South Africa. 🇮🇳 pic.twitter.com/hGpMQmUDYDCAPTAIN KL RAHUL CREATED HISTORY...!!!!
— Johns. (@CricCrazyJohns) December 17, 2023
- He becomes the first Indian captain to win the Pink ODI match in South Africa. 🇮🇳 pic.twitter.com/hGpMQmUDYD
అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర
Arshdeep Singh Record :ఈ మ్యాచ్‌లోనే టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అర్ష్‌దీప్‌కు ముందు సౌతాఫ్రికాపై పలువురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం.
-
Arshdeep Singh's 5-wicket haul against South Africa.
— CricketMAN2 (@ImTanujSingh) December 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- The Magical spell by Arshdeep..!!! pic.twitter.com/3FaE3ELfWh
">Arshdeep Singh's 5-wicket haul against South Africa.
— CricketMAN2 (@ImTanujSingh) December 17, 2023
- The Magical spell by Arshdeep..!!! pic.twitter.com/3FaE3ELfWhArshdeep Singh's 5-wicket haul against South Africa.
— CricketMAN2 (@ImTanujSingh) December 17, 2023
- The Magical spell by Arshdeep..!!! pic.twitter.com/3FaE3ELfWh
India Vs South Africa ODI 2023 : మ్యాచ్ విషయానికొస్తే- సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది భారత్. అర్ష్‌దీప్ (10-0-37-5), ఆవేశ్ ఖాన్ (8-3-27-4) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ (55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (52) భారత్‌ను గెలిపించారు. ఈ గెలుపుతో భారత్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. రెండో వన్డే డిసెంబర్ 19న జరగనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న ఇషాన్- సౌతాఫ్రికా టూర్ నుంచి రిటర్న్
రోహిత్ కెప్టెన్సీలో స్టార్లుగా మారిన క్రికెటర్లు- పాండ్యనే ఫస్ట్!!