Ind vs Pak Asia Cup 2023 : ఆసియా కప్ 2023లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసిన భారత్ ఆలౌటైంది. టాపార్డర్ ఫెయిలైనప్పటికీ.. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ (82 పరుగులు), హార్దిక్ పాండ్య (87 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించి.. భారత్‌కు పోరాడగలిగే స్కోర్‌ను కట్టబెట్టారు. ఈ క్రమంలో వీరు పలు రికార్డులు బద్దలుగొట్టారు. అవేంటంటే..
ఆ రికార్డు కొట్టేశారు..
India 5th Wicket Partnership In Asia Cup : భారత్ 66-4 స్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య, ఇషాన్‌తో జతకట్టాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకొని, స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఐదో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆసియా కప్ చరిత్రలో భారత్‌కు.. ఇదే ఐదో వికెట్ అత్యుత్తమ పార్ట్నర్షిప్. అయితే ఇదివరకు ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్-యువరాజ్ సింగ్ పేరిట ఉంది. వీరు 2004 ఆసియా కప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 133 పరుగులు జోడించారు.
-
A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40
">A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40A fine 87-run knock from #TeamIndia vice-captain! 👏 👏
— BCCI (@BCCI) September 2, 2023
Well played, Hardik Pandya 👍 👍
Follow the match ▶️ https://t.co/hPVV0wT83S#AsiaCup23 | #INDvPAK pic.twitter.com/0ZIkQtzw40
-
FIFTY!
— BCCI (@BCCI) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A well made half-century by @ishankishan51 off 54 deliveries 👏👏
His 7th in ODIs!
Live - https://t.co/B4XZw382cM… #INDvPAK pic.twitter.com/6FII0XRTRu
">FIFTY!
— BCCI (@BCCI) September 2, 2023
A well made half-century by @ishankishan51 off 54 deliveries 👏👏
His 7th in ODIs!
Live - https://t.co/B4XZw382cM… #INDvPAK pic.twitter.com/6FII0XRTRuFIFTY!
— BCCI (@BCCI) September 2, 2023
A well made half-century by @ishankishan51 off 54 deliveries 👏👏
His 7th in ODIs!
Live - https://t.co/B4XZw382cM… #INDvPAK pic.twitter.com/6FII0XRTRu
ఆసియా కప్ హిస్టరీలో భారత్ తరఫున ఐదో వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యాలు..
- 138 పరుగులు.. ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్య VS పాకిస్థాన్ 2023
- 133 పరుగులు.. రాహుల్ ద్రవిడ్-యువరాజ్ సింగ్ VS శ్రీలంక 2004
- 112 పరుగులు.. ధోనీ-రోహిత్ శర్మ VS పాకిస్థాన్ 2008
- 79 పరుగులు.. ధోనీ-రోహిత్ శర్మ VS శ్రీలంక 2010.
ఇండోపాక్ పోరులో రెండో అత్యుత్తమం..
వన్డేల్లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో ఐదో వికెట్‌కు.. ఇషాన్-హార్దిక్ (138 పరుగులు) భాగస్వామ్యం రెండో అత్యుత్తమం. ఇక ఈ జాబితాలో పాక్ బ్యాటర్లు ఇమ్రాన్ ఖాన్-జావెద్ మియందాద్ (142 పరుగులు) టాప్‌లో ఉన్నారు. వీరు 1987లో నాగ్‌పుర్ వేదికగా ఈ రికార్డు నెలకొల్పారు. తాజా మ్యాచ్‌లో ఇషాన్-హార్దిక్ మరో 5 పరుగులు జోడించి ఉంటే.. 36 ఏళ్ల రికార్డు బద్దలయ్యేది.
ఇక ఈ లిస్ట్‌లో (135 పరుగులు), (132 పరుగులు)తో రాహుల్ ద్రవిడ్-మహమ్మద్ కైఫ్ జోడీ.. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో ఉన్నారు. 2012లో ధోనీ-అశ్విన్ 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి.. ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.