న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు బాగానే రాణించారు. శుభమన్ గిల్ సెంచరీ(126) తోడవ్వడం వల్ల భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది.
ఈ సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన గిల్ ఈ మ్యాచ్‌లో అద్భత ప్రదర్శన చేశాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో పొట్టి ఫార్మాట్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. 187.04 స్ట్రైక్ రేట్‌తో ఊగిపోయాడు. ఇక శతకం బాదాక కూడా సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సెంచరీ సాధించిన వెంటనే ప్రేక్షకుల వైపు తలవంచి అభివాదం చేశాడు. అలా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఓ డబుల్ సెంచరీ, మరో శతకం బాదిన గిల్.. టీ20ల్లోనూ శతకాల పరంపరను కొనసాగించాడు.
గిల్ సెంచరీకి రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరుత్సాహపరిచాడు. ప్రత్యర్థి జట్టులో మైఖేల్ బ్రాస్‌వెల్, బ్లెయిర్ టిక్నర్, ఇష్ సోది, డేరిల్ మిచెల్ తలో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: మణికట్టు విరిగినా ఒంటిచేత్తో పోరాటం.. రంజీలో ఆంధ్ర సారథి హనుమ 'విహారం'..