ETV Bharat / sports

ind vs nz test: మయాంక్​ అగర్వాల్ సెంచరీ- టెస్టుల్లో నాలుగో శతకం

ind vs nz test 2021: వాంఖడే వేదికగా జరుగుతున్న టీమ్​ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టులో మయాంక్​ అగర్వాల్ సెంచరీతో సత్తాచాటాడు. నిలకడగా ఆడుతూ కీలకమైన సమయంలో జట్టును ఆదుకున్నాడు.

mayank agarwal
మయాంక్​ అగర్వాల్​
author img

By

Published : Dec 3, 2021, 4:58 PM IST

Updated : Dec 3, 2021, 6:31 PM IST

mayank agarwal century in test: టీమ్​ఇండియా-న్యూజిలాండ్ రెండో టెస్టులో మయాంక్​ అగర్వాల్ సెంచరీతో సత్తా చాటాడు. డారిల్‌ మిచెల్ వేసిన 58.1 బంతికి ఫోర్‌ కొట్టి మయాంక్ అగర్వాల్ (100) శతకం అందుకున్నాడు. ఇది మయాంక్‌కు టెస్ట్ కెరీర్‌లో నాలుగో సెంచరీ.

ind vs nz test 2021
సెంచరీ ఆనందంలో మయాంక్​ అగర్వాల్​

ఓపెనర్​గా బరిలోకి దిగిన మయాంక్​ నిలకడగా రాణించాడు. గిల్​(48)కే వెనుదిరిగాక.. తర్వాత వచ్చిన సీనియర్లు పుజారా, కోహ్లీ డకౌట్​తో పెవిలియన్ చేరారు. ఇలాంటి కీలక సమయంలో మయాంక్​ జట్టును ఆదుకున్నాడు. టీ బ్రేక్​ సమయానికి అర్ధ సెంచరీ పూర్తి చేసి బౌలర్లను ఇరుకున పెట్టాడు. 196 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌ల సహాయంతో మూడంకెల స్కోరు అందుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్, వృద్ధీమాన్ సాహా నిలకడగా ఆడుతున్నారు.

ind vs nz test 2021
నిలకడగా రాణించిన మయాంక్​ అగర్వాల్​

ఇదీ చదవండి: ind vs nz test: మయాంక్​ అర్ధ శతకం.. టీ బ్రేక్ సమయానికి భారత్ 111/3

Last Updated : Dec 3, 2021, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.