ETV Bharat / sports

IND vs NZ Test: భారత్​కు షాక్.. గాయంతో రహానే, జడేజా, ఇషాంత్ దూరం - భారత్-న్యూజిలాండ్ టెస్టు రహానే దూరం

IND vs NZ Test: న్యూజిలాండ్​తో రెండో టెస్టుకు ముందు భారత్​కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఈ మ్యాచ్​కు జడేజా, రహానే, ఇషాంత్ అందుబాటులో ఉండట్లేదని తెలిపింది బీసీసీఐ.

IND vs NZ Test
IND vs NZ Test
author img

By

Published : Dec 3, 2021, 9:54 AM IST

Updated : Dec 3, 2021, 10:03 AM IST

IND vs NZ Test: వాంఖడే వేదికగా నేడు (శుక్రవారం) భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. అయితే ఈ మ్యాచ్​కు టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్లు అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా దూరమయ్యారు. గాయాల కారణంగా వీరు ఈ మ్యాచ్​కు అందుబాటులో ఉండట్లేదని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఇషాంత్ స్థానంలో సిరాజ్​కు అవకాశం దక్కనుంది. అలాగే రహానే స్థానంలో మొదటి టెస్టుకు విశ్రాతి తీసుకున్న కోహ్లీ ఆడునున్నాడు. ఇషాంత్ ప్లేస్​లో జయంత్ యాదవ్​ను తీసుకునే వీలుంది.

విలియమ్సన్ ఔట్

అలాగే న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్​ కూడా ఈ మ్యాచ్​లో ఆడట్లేదు. ఎడమ మోచేతి గాయం కారణంగా ఇతడు ఈ టెస్టుకు దూరమైనట్లు తెలిపింది కివీస్ క్రికెట్ బోర్డు. ఇతడి గైర్హాజరుతో టామ్ లాథమ్​ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

టాస్ ఆలస్యం

IND vs NZ Test Toss: రెండు రోజులుగా ముంబయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాంఖడే మైదానం చిత్తడిగా మారింది. నేడు (శుక్రవారం) వర్షం లేకపోయినా.. పిచ్​, ఔట్​ఫీల్డ్ తడిగా ఉంది. దీంతో టాస్​ ఆలస్యం కానున్నట్లు తెలిపారు అంపైర్లు. 10.30 గంటలకు మరోసారి పిచ్​ను పరీక్షించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: India vs NZ 2nd Test: సిరీస్​పై కన్నేసిన ఇరుజట్లు.. భారత్​కు అదే సమస్య!

Last Updated : Dec 3, 2021, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.