ETV Bharat / sports

IND VS AUS: హార్దిక్​ సూపర్​ బౌలింగ్​.. పాపం స్మిత్, మార్ష్​.. మిడిల్​ స్టంప్​ గాల్లోకే.. - టీమ్ఇండియా ఆస్ట్రేలియా మూడో వన్డే

చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అదిరిపోయే ప్రదర్శన చేశాడు. స్మిత్​ను డకౌట్​ చేశాడు. దీంతో స్మిత్​.. వన్డేల్లో హార్దిక్​ చేతిలో ఔట్​ అవ్వడం ఇది ఐదోసారి. అలానే భారీ ఇన్నింగ్స్​ దిశగా దూసుకెళ్లిన మార్షన్​ను పెవిలియన్​కు పంపాడు. ఆ వివరాలు..

IND VS AUS third ODI Hardik pandya dismisses steve smith for the Fifth time in ODI
IND VS AUS: హార్దిక్​ సూపర్​ బౌలింగ్​.. పాపం స్మిత్, మార్ష్​.. మిడిల్​ స్టంప్​ గాల్లోకే..
author img

By

Published : Mar 22, 2023, 5:01 PM IST

చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్​ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బంతిలో చెలరేగిపోతూ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. స్టార్‌ పేసర్లు షమీ, సిరాజ్‌ చేతులెత్తేయడంతో.. ఎంట్రీ ఇచ్చిన హార్దిక్‌ అదరగొట్టాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హెడ్‌, మిచెల్‌ మార్ష్‌ మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ ఫస్ట్​ వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి.. పవర్‌ప్లేలో ముగ్గురు బౌలర్లను మార్చినా ఫలతం దక్కలేదు. అప్పుడే బంతిని హార్దికి చేతికి ఇచ్చాడు కెప్టెన్ రోహిత్​ శర్మ. దీంతో హార్దిక్​.. తాను వేసిన ఫస్ట్​ ఓవర్‌లోనే దూకుడుగా ఆడుతున్న హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు.

అనంతరం తాత్కలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్​ను(0) ఔట్ చేశాడు. దీంతో స్మిత్ డకౌట్​గా వెనుదిరిగాడు. వన్డేల్లో హార్దిక్ పాండ్య బౌలింగ్​లో స్మిత్ ఔటవ్వడం ఇది ఐదోసారి. ఫలితంగా ఈ వన్డే ఫార్మాట్‌లో స్మిత్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసిన తొలి పేసర్​గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. మొత్తంగా రెండో బౌలర్‌గా నిలిచాడు. ఇక అదే వన్డేల్లో స్పిన్నర్​ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో స్మిత్ ఆరు సార్లు ఔట్​య్యాడు. ట్రెంట్ బౌల్ట్, ఉమేశ్ యాదవ్, మహ్మద్​ షమీ, మార్క్ వుడ్, క్రిస్ బ్రాడ్ బౌలింగ్‌లో స్మిత్ మూడేసి సార్లు ఔట్​ అయ్యాడు. హార్దిక్ పాండ్య వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని స్మిత్ బూమింగ్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి కాస్త మిస్ అయ్యి బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో స్మిత్ నిరాశగా వెనుదిరిగాడు.

ఇక ఇదే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌ దిశగా దూసుకుపోతున్న మిచెల్‌ మార్ష్‌ను తన సూపర్​ డెలివరీతో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు హార్దిక్​. అతడు ఔట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా వేసిన బంతిని.. మార్ష్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడటానికి ట్రై చేశాడు. అయితే బంతి థిక్‌ ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను గిరాటేసింది. అయితే దానికి ముందు బంతినే మార్ష్​ బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే తర్వాతి బంతిని కూడా బౌండరీ కొట్టాలని ప్రయత్నించిన మార్ష్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో కుల్దీప్​ యాదవ్​ ఇప్పటివరకు మూడు వికెట్లు తీయగా.. అక్సర్ పటేల్​ ఓ వికెట్​ను పడగొట్టాడు.

ఇదీ చూడండి: IND VS AUS: మూడో వన్డేలో కోహ్లీ లుంగీ డ్యాన్స్​.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.