ETV Bharat / sports

IND vs AUS : ఆసీస్​కు మరో బిగ్​ షాక్​.. మూడో టెస్టుకు దూరమైన కెప్టెన్

author img

By

Published : Feb 24, 2023, 3:44 PM IST

IND vs AUS : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆస్ట్రేలియాకు మరో బిగ్​ షాక్​ తగిలింది. ఆ జట్టు కెప్టెన్​ పాట్​ కమిన్స్​ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు.

Pat cummins border gavaskar trophy
Pat cummins border gavaskar trophy

IND vs AUS : బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో భాగంగా భారత్​తో జరిగిన రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది​. ఇప్పుడు కంగారూలకు మరో షాక్ ​తగిలింది. ఆ టీమ్​ కెప్టెన్​ పాట్ కమిన్స్​ అత్యవసరంగా స్వదేశానికి వెళ్లాడు. దీంతో మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. ఇక, వైస్​ కెప్టెన్​గా ఉన్న స్టీవ్​ స్మిత్​ మూడో టెస్టుకు సారథ్యం వహించనున్నాడు.

దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు తర్వాత వ్యక్తిగత పనుల నిమిత్తం కమిన్స్​ ఆస్ట్రేలియా వెళ్లాడు. మూడో టెస్టుకు కమిన్స్​ అందుబాటులో ఉంటాడని అనుకున్నారు. కానీ అతడు భారత్​కు రావడం కుదరలేదు. ఈ విషయంపై ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు క్లారిటీ ఇచ్చాడు కమిన్స్. తన తల్లి అనారోగ్యం కారణంగా రాలేనని యాజమాన్యానికి తెలిపాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాను తన కుటుంబంతో ఉండటం ముఖ్యమని.. తనకు క్రికెట్ ఆస్ట్రేలియా, టీమ్​ సభ్యుల నుంచి లభించిన సహాకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కమిన్స్​ పేర్కొన్నాడు.

నాలుగు టెస్టుల బోర్డర్​ గావస్కర్ సిరీస్​లో తొలి రెండు టెస్టుల్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. అశ్విన్​, జడేజా షమీ, సిరాజ్​ విజృంభించారు. బ్యాటర్లు కూడా అద్భుతంగా రాణించారు. దీంతో ఈ సిరీస్​లో 2-0 తేడాతో టీమ్​ఇండియా అధిక్యంలో నిలిచింది. ఇకపోతే ఈ రెండు మ్యాచ్​ల్లో చేతులెత్తేసిన కాంగారూలను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆసీస్​ ప్లేయర్లు​ హేజిల్​వుడ్​, స్టార్​ హిట్టర్​ డేవిడ్​ వార్నర్​ గాయాలతో జట్టుకు దూరమవ్వగా.. ప్రస్తుతం కమిన్స్​ కూడా అందుబాటులో లేకపోవడం అసీస్​కు పెద్ద దెబ్బే. అయితే మూడో టెస్టుకు కామెరూన్​ గ్రీన్​ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.