Ind vs Aus 3rd ODI 2023 : రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డేలో.. ఆసీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఓవర్లన్నీ ఆడి ఆరు వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (56 పరుగులు : 34 బంతుల్లో 6x4, 4x6), మిచెల్ మార్ష్ (96 పరుగులు : 84 బంతుల్లో 13x4, 3x6), స్టీవ్ స్మిత్ (74 పరుగులు : 61 బంతుల్లో 8x4, 1x6), మార్నస్ లబుషేన్ (72 పరుగులు : 58 బంతుల్లో 9x4) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.
టాప్ లేపిన టాపార్డర్... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. టాపార్డర్‌లో నలుగురు బ్యాటర్లు కలిసి 298 పరుగులు సాధించడం విశేషం. ముఖ్యంగా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్.. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటు ప్రారంభంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ టీ20 తరహాలో పరుగులు చేస్తూ.. కాసేపు భారత శిబిరంలో గుబులు పుట్టించారు. ఇక వార్నర్ అయితే 164 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడ్డాడు. వీరి ధాటికి ఆసిస్ 8 ఓవర్లలో 78/0 తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇక డేంజరస్‌గా మారుతున్న వార్నర్‌ను.. ప్రసిద్ధ్ 8.1 ఓవర్ వద్ద ఔట్‌చేసి టీమ్ఇండియాకు తొలి బ్రేక్ ఇచ్చాడు.
-
Innings break!
— BCCI (@BCCI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia post 352/7 in the first innings!
Over to our batters 💪
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6
">Innings break!
— BCCI (@BCCI) September 27, 2023
Australia post 352/7 in the first innings!
Over to our batters 💪
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6Innings break!
— BCCI (@BCCI) September 27, 2023
Australia post 352/7 in the first innings!
Over to our batters 💪
Scorecard ▶️ https://t.co/H0AW9UXI5Y#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/FBH2ZdnEF6
మార్ష్-స్మిత్ ద్వయం.. వార్నర్ ఔట్‌తో క్రీజులోకి వచ్చిన స్మిత్.. మరింత నిలకడగా ఆడాడు. అతడు మార్ష్‌తో కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో మార్ష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకొని.. సెంచరీ దిశగా సాగుతుండగా 96 వ్యక్తిగత స్కోర్ వద్ద కుల్దీప్ అతడ్ని వెనక్కిపంపాడు. మార్ష్ ఔటైన తర్వాత కూడా స్మిత్ దుకుడును కొనసాగించాడు. ఇక మరో బ్యాటర్ లబుషేన్ కూడా తనదైన రీతిలో రెచ్చిపోయాడు. కానీ ఆఖర్లో అతడు ఔటవ్వడం వల్ల.. స్కోర్ వేగం నెమ్మదించింది.
స్మిత్ @5000.. ఈ మ్యాచ్‌తో స్మిత్ వన్డేల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక ఈ ఫీట్ సాధించిన 17వ ఆసీస్ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్ 145 మ్యాచ్‌ల్లో 5054 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలు, 30 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత దిగ్గజం సచిన్ తెందూల్కర్ (18426) టాప్‌లో ఉన్నాడు.
తేలిపోయిన టీమ్ఇండియా బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మినహా.. మిగతా బౌలర్లందరూ 6 ఎకనమీకిపైగా పరుగులు సమర్పించుకున్నారు. స్టార్ పేసర్ బుమ్రా.. పది ఓవర్లలో ఏకంగా 81 పరుగులు ఇచ్చుకున్నాడు.
-
𝙔𝙊𝙍𝙆𝙀𝘿!
— BCCI (@BCCI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
What a delivery that from @Jaspritbumrah93 to dismiss Glenn Maxwell 🔥🔥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6XzupmqMec
">𝙔𝙊𝙍𝙆𝙀𝘿!
— BCCI (@BCCI) September 27, 2023
What a delivery that from @Jaspritbumrah93 to dismiss Glenn Maxwell 🔥🔥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6XzupmqMec𝙔𝙊𝙍𝙆𝙀𝘿!
— BCCI (@BCCI) September 27, 2023
What a delivery that from @Jaspritbumrah93 to dismiss Glenn Maxwell 🔥🔥#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/6XzupmqMec