Top Five Fielders In World cup : భారత్ వేదికగా ప్రస్తుతం వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. 2011 లో శ్రీలంక, బంగ్లాదేశ్ తో కలిసి నిర్వహించిన ఈ టోర్నీకి తొలిసారి సారి మన దేశం సొంతంగా ఆతిథ్యమిస్తోంది. ఇక ఇందులో పాల్గొంటున్న ప్రతి జట్టు కప్పును గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకే ఈ టోర్నీ కోసం అన్ని జట్లు పటిష్ఠ బ్యాటర్లు, బౌలర్లతో పాటు అత్యుత్తమ ఫీల్డర్లను ఎంపిక చేశాయి. ఎందుకంటే.. కొన్ని సార్లు పరుగులు ఆపడం వల్లా మ్యాచ్ ఫలితాలు తలకిందులైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో టాప్ 5 ఫీల్డర్లు ఎవరో ఓ సారి చూద్దాం..
1. రికీ పాంటింగ్
ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ ఫీల్డర్ల గురించి చర్చించినప్పుడు.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు ఆ జాబితాలో టాప్‌లో ఉంటుంది. ఆ జట్టులకు రెండు వరల్డ్ కప్పులు అందించిన ఘనత అతని సొంతం. 1996 నుంచి 2011 వరకు జరిగిన టోర్నీల్లో ఆడిన పాంటింగ్.. మొత్తం 46 మ్యాచుల్లో పాల్గొన్నాడు. అందులో 28 క్యాచులు అందుకున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచులో 3 క్యాచులు అందుకున్నాడు. క్యాచెస్ అందుకునే విషయంలో అతని యావరేజ్ 0.608.
2. జో రూట్
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆటగాడు.. వరల్డ్ కప్ టాప్ - 5 ఫీల్డర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రూట్ ఇప్పటి వరకు 2015, 2019 వరల్డ్ కప్ లలో పాల్గొన్నాడు. మొత్తం 17 మ్యాచులు ఆడిన అతను.. 20 క్యాచెస్ అందుకున్నాడు. ఇతను కూడా దాదాపు ప్రతి మ్యాచ్ లో మూడేసి క్యాచులు పట్టాడు. క్యాచెస్ యావరేజ్ 1.176 గా ఉంది.
3. సనత్ జయసూర్య
శ్రీలంక జట్టు మాజీ ఓపెనర్, వెటరన్ బ్యాటర్ సనత్ జయసూర్య ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు. ఒంటిచేత్తో శ్రీలంక జట్టును ఎన్నో సార్లు గెలిపించాడు. ఇతను 1992 నుంచి 2007 వరకు టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తం 38 మ్యాచులు ఆడగా.. అందులో 18 క్యాచెస్ అందుకున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్ లో రెండు క్యాచులు పట్టాడు. ఇతని క్యాచెస్ యావరేజీ 0.473.
4. క్రిస్ గేల్
యూనివర్సల్ బాస్‌గా పేరొందిన వెస్టిండీస్ భీకర ఆటగాడు క్రిస్ గేల్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. సిక్సుల వర్షం కురిపించి పరుగుల వరద పారించే ఇతను.. ఫీల్డింగ్ సైతం అంతే అద్భుతంగా చేస్తాడు. ఈ క్రమంలో వరల్డ్ కప్ చరిత్రలో టాప్ - 5 ఫీల్డర్ల లిస్టులో నాలుగో స్థానంలో నిలిచాడు. తన కెరీర్లో 2003 నుంచి 2019 వరకు జరిగిన టోర్నీల్లో పాల్గొన్నాడు. మొత్తం 35 మ్యాచుల్లో 17 క్యాచులు పట్టాడు. అతని క్యాచెస్ యావరేజ్ 0.485.
5. ఫాఫ్ డుప్లెసిస్
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తన అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్. ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద క్యాచులు అందుకోవడంతో పాటు పరుగులు ఆపడంలోనూ ఎక్స్పర్ట్ అయిన ఇతను.. వరల్డ్ కప్ చరిత్రలో టాప్ - 5 ఫీల్డర్ల జాబితాలో అయిదో స్థానాన్ని సంపాదించుకున్నాడు. 2011 నుంచి 2019 వరకు జరిగిన టోర్నీల్లో ఫాఫ్ మొత్తం 23 మ్యాచులు ఆడాడు. అందులో 16 క్యాచుల్ని ఒడిసిపట్టాడు. దాదాపు ప్రతి మ్యాచుకి 2 క్యాచుల చొప్పున అందుకున్నాడు. అతని క్యాచెస్ యావరేజ్ 0.272 గా ఉంది.