ETV Bharat / sports

ICC ODI Rankings : పాకిస్థాన్​కు షాకిచ్చిన టీమ్​ఇండియా.. నెం.1గా ఆసీస్​.. కొత్త లెక్కలు ఇవే! - ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​ లేటెస్ట్​

ICC ODI Rankings : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో పాకిస్థాన్​ను టీమ్​ఇండియా వెనక్కినెట్టింది. నెం.1 స్థానాన్ని ఆస్ట్రేలియా దక్కించుకుంది. ఆ వివరాలివే..

ICC ODI Rankings
ICC ODI Rankings
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 1:49 PM IST

Updated : Sep 15, 2023, 1:58 PM IST

ICC ODI Rankings : ఆసియా కప్​ 2023 టోర్నీలో టీమ్​ఇండియా దూసుకుపోతోంది. నేపాల్​, పాకిస్థాన్​, శ్రీలంకపై ఘన విజయాలు సాధించి ఫైనల్​కు చేరింది. అయితే కీలకమైన సూపర్-4 మ్యాచ్‍లో గురువారం శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది పాకిస్థాన్​.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి తర్వాత.. తాజాగా వచ్చిన ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ పాకిస్థాన్‍ను వెనక్కి నెట్టి టీమ్​ఇండియా పైకి ఎగబాకింది.

శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ మూడో ర్యాంకుకు పడిపోయింది. 115 రేటింగ్ పాయింట్ల (3,102 పాయింట్ల)తో మూడో స్థానానికి దిగజారింది. మరోవైపు ఆసియాకప్‍లో ఫుల్ జోరు మీదు ఉన్న టీమ్​ఇండియా 116 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో రెండో ర్యాంకుకు ఎగబాకింది. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‍లో దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో ఇటీవలే టాప్ ర్యాంకుకు చేరింది. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ (103), న్యూజిలాండ్ (102), దక్షిణాఫ్రికా (101), శ్రీలంక (93) ఉన్నాయి.

ICC ODI Rankings
ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్​

ICC ODI Rankings Team India : మరోవైపు, ఐసీసీ​ ర్యాంకింగ్స్​లో అన్ని జట్ల కంటే టీమ్​ఇండియా బెస్ట్​ టీమ్​గా నిలిచింది. టెస్టులు, టీ20 ర్యాంకింగ్స్​ టాప్​లో ఉన్న భారత్​.. ఇప్పుడు వన్డేల్లోనూ రెండో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం జరగనున్న బంగ్లాదేశ్​తో జరగనున్న మ్యాచ్​తో పాటు, ఆసియా కప్​ ఫైన్​లో టీమ్​ఇండియా టాప్​ ర్యాంక్​కు చేరుతుంది. స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్​కు ముందు భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాక్​ కెప్టెన్​ మాత్రం సేఫ్​!
ICC ODI Rankings Babar Azam : ఆసియా కప్‌లో బ్యాట్​తో పెద్దగా రాణించని పాక్ కెప్టెన్​ బాబర్ అజామ్​ మాత్రం వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానం కాపాడుకున్నాడు. అదే సమయంలో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన శుభ్‌మన్ గిల్ తన కెరీర్ అత్యుత్తమంగా రెండో స్థానానికి చేరాడు. టాప్ టెన్ వన్డే బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి గిల్, రోహిత్, కోహ్లీ ముగ్గురు ఉండటం గమనార్హం. ఇలా టాప్ టెన్ బ్యాటర్లలో ముగ్గురు భారతీయులు ఉండి చాలా కాలమైంది. గతంలో కోహ్లీ, రోహిత్, ధావన్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం కోహ్లీ 8వ స్థానంలో, రోహిత్ 9వ స్థానంలో ఉన్నారు

Last Updated : Sep 15, 2023, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.