ETV Bharat / sports

ఫస్ట్​ ప్లేస్​​పై కోహ్లి కన్ను - వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్ ఏ​ పొజిషన్​లో ఉన్నాడంటే?

ICC Latest ODI Rankings : ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. అయితే ఈ సారి నెంబర్​ వన్​ పొజిషన్​పై విరాట్ కోహ్లి కన్నేశాడు. ఈ క్రమంలో శుభమన్​ గిల్, బాబర్ ఆజంలకు మరింత చేరువయ్యాడు. ఇంతకీ ఎవరెవరు ఏయే పొజిషన్స్​లో ఉన్నారంటే ?

ICC Latest ODI Rankings
ICC Latest ODI Rankings
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 4:15 PM IST

Updated : Nov 22, 2023, 4:51 PM IST

ICC Latest ODI Rankings :ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. వన్డే ప్రపంచకప్​ ముగిసిన తర్వాత విడుదలైన ఈ ర్యాంకింగ్స్​లో పలు మార్పులు వచ్చాయి. అయితే ఈ సారి నెంబర్​ వన్​ పొజిషన్​పై విరాట్ కోహ్లి కన్నేశాడు. ఈ క్రమంలో తొలి రెండు స్థానాల్లో స్థిరంగా ఉన్న శుభమన్​ గిల్ (826 పాయింట్లు), బాబర్ ఆజంలకు( 824 పాయింట్లు) మరింత చేరువయ్యాడు.

వరల్డ్​ కప్​ సెమీ-ఫైనల్స్​లో సెంచరీ.. ఫైనల్‌లో హాఫ్ సెంచరీ సాధించిన కోహ్లి తన మూడవ స్థానాన్ని ఈ ర్యాంకింగ్స్​లో సుస్థిరం చేసుకున్నాడు. అయితే 2017 నుంచి 2021 మధ్య కాలంలో.. విరాట్ కోహ్లి ఏకంగా 1258 రోజుల పాటు వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు. ఆ తర్వాత ఫామ్ కోల్పోవడం వల్ల కోహ్లి ప్లేస్​లో బాబర్ వచ్చాడు. ఈ మధ్యే బాబర్​ స్థానాన్ని గిల్​ అందుకున్నాడు .

ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ .. 769 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానానికి ఎగబాకాడు. ఇక సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ 760 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

ODI Bowlers Rankings 2023 : ఇక.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా పేసర్​ మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ టాప్ 10లో ఉన్నారు. 699 పాయింట్లతో సిరాజ్​ మూడవ స్థానంలో ఉండగా.. జస్ప్రీత్​ బుమ్రా 685 పాయింట్లతో నాల్గవ స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మహ్మద్​ షమీ 648 పాయింట్లతో 10వ ప్లేస్​లో ఉన్నాడు. అయితే 741 పాయింట్లతో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ODI All Rounders Rankings 2023 : మరోవైపు ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ 330 పాయింట్లతో మొద‌టి స్థానాన్ని కైవసం చేసుకోగా.. అఫ్గానిస్థాన్‌ ప్లేయర్​ మహ్మద్ న‌బీ 297 పాయింట్లతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక టీమ్​ఇండియా నుంచి స్టార్ ఆల్​రౌండర్​.. ర‌వీంద్ర జ‌డేజా ప‌దో పొజిషన్​ కొన‌సాగుతున్నాడు. 222 పాయింట్లతో జడ్టూ ఆ స్థానంలో ఉన్నాడు.

Last Updated : Nov 22, 2023, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.