ETV Bharat / sports

ఐసీసీ ప్లేయర్​ 'ఆఫ్​ ది మంత్​' రేసులో వీరే! - ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్

సెప్టెంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' (icc player of the month) నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ (ICC News). ఈ జాబితాలో పురుషుల క్రికెట్​ నుంచి ముగ్గురు, మహిళలు ముగ్గురు ఉన్నారు.

ICC
ఐసీసీ
author img

By

Published : Oct 6, 2021, 5:24 PM IST

సెప్టెంబర్​ నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ (ICC Player Of The Month) జాబితాను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC). ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ (ICC News). అందులో భాగంగానే సెప్టెంబర్​ నెల (ICC Player Of The Month September 2021) కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

"పురుషుల క్రికెట్​లో బంగ్లాదేశ్ స్పిన్నర్ నాసుమ్ అహ్మద్, నేపాల్​ బౌలర్ సందీప్ లమిచానే, అమెరికా క్రికెటర్ జాస్కరన్ మల్హోత్రా పోటీలో నిలిచారు. మహిళల క్రికెట్​లో ఇంగ్లాండ్​కు చెందిన చార్లీ డీన్, హీతర్ నైట్, దక్షిణాఫ్రికాకు చెందిన లీజల్ లీ పేర్లను పరిగణలోకి తీసుకున్నాం."

- అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ)

గత నెల న్యూజిలాండ్​తో సిరీస్​ సందర్భంగా ఒకే టీ20 మ్యాచ్​లో రెండు మెయిడెన్​ ఓవర్లు వేసిన తొలి బౌలర్​గా నిలిచాడు నాసుమ్ అహ్మద్. పపువా న్యుగినియాతో మ్యాచ్​లో ఒకే ఓవర్​లో ఆరు సిక్సర్లు బాదాడు జాస్కరన్ మల్హోత్రా. న్యూజిలాండ్​పై 4-1తేడాతో ఇంగ్లాండ్​ గెలవడంలో కీలక పాత్ర పోషించింది చార్లీ డీన్. ఇదే సిరీస్​లో తొలి వన్డేలో 89 పరుగులు, నాలుగో వన్డేలో 101 పరుగులు సహా 3 వికెట్లు కూడా తీసి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' (ICC Player Of The Month) అవార్డు రేసులో నిలిచింది ఆల్​రౌండర్ హీతర్ నైట్.

ఇదీ చూడండి: ICC POTM: 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డు విజేతలు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.