ETV Bharat / sports

Shikhar Dhawan: 'కెప్టెన్సీని గొప్పగా భావిస్తున్నా' - srilanka tour

శ్రీలంక పర్యటనలో భారత జట్టును ముందుండి నడిపించే అవకాశం కల్పించడంపై స్పందించాడు శిఖర్ ధావన్. ఈ అవకాశాన్ని గొప్పగా భావిస్తున్నట్లు తెలిపాడు.

shikhar dhawan, indian cricketer
శిఖర్ ధావన్, టీమ్ఇండియా క్రికెటర్
author img

By

Published : Jun 11, 2021, 4:44 PM IST

శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం టీమ్ఇండియా కెప్టెన్​గా అవకాశం కల్పించడంపై శిఖర్​ ధావన్ స్పందించాడు. సదరు నిర్ణయాన్ని గొప్పగా భావిస్తున్నట్లు తెలిపాడు.

"దేశానికి నాయకత్వం వహించడం గొప్పగా భావిస్తున్నా. మీ అందరి విషెస్​కు ధన్యవాదాలు" అని ధావన్ ట్వీట్ చేశాడు.

ఇప్పటివరకు 34 టెస్టులతో పాటు 145 వన్డేలు, 65 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు గబ్బర్​. జులై 13 నుంచి 25 వరకు మూడు టీ20లు ఆడడానికి భారత జట్టు లంకలో పర్యటించనుంది. సీనియర్​ బౌలర్​ భువనేశ్వర్​ కుమార్​ను వైస్​ కెప్టెన్​గా నియమించింది బోర్డు. ఈ సిరీస్​ కోసం కొత్త ముఖాలను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. క్రిష్ణప్ప గౌతమ్​, దేవ్​దత్​ పడిక్కల్​, నితీష్ రానా, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియాలకు తొలిసారి జట్టులో చోటు దక్కింది. ​

ఇదీ చదవండి: WTC Final: 'ఆ స్థానంలో నా ఓటు శార్దుల్​కే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.