ETV Bharat / sports

భారత్​-హాంకాంగ్​ మ్యాచ్​.. స్టేడియంలో క్రికెటర్​ లవ్​ ప్రపోజల్​

ఆసియా కప్‌ 2022లో భాగంగా టీమ్​ఇండియా-హాంకాంగ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్రికెటర్ స్టేడియంలోనే​ తన ప్రేయసికి రింగ్ తొడిగి ప్రపోజ్​ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

girlfriend propose
స్డేడియంలో గర్ల్​ఫ్రెండ్​కు ప్రపోజ్​
author img

By

Published : Sep 1, 2022, 9:34 AM IST

Updated : Sep 1, 2022, 9:41 AM IST

ఆసియా కప్‌-2022లో భాగంగా బుధవారం జరిగిన టీమ్​ఇండియా-హాంకాంగ్​ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. హాంకాంగ్ బ్యాటర్ కించిత్ షా.. స్టేడియంలోనే తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే స్టాండ్స్‌లోకి వెళ్లిన కించిత్.. అక్కడ కూర్చుని మ్యాచ్‌ను వీక్షిస్తున్న తన ప్రేయసికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

ఆమె ముంగిట మోకాళ్ల మీద కూర్చొని తన ప్రేమను వ్యక్తపరిచాడు. స్టేడియంలో అందరూ చూస్తుండగా..ఆమె చేతికి రింగ్ తొడిగాడు. కించిత్‌ క్యూట్‌ ప్రపోజ్‌కు ఆమె ఫిదా అయిపోయింది. ఈ క్రమంలోనే మరోవైపు చాహర్‌, అతడి ప్రేయసి ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంలో మునిగితేలారు. దీంతో స్టేడియం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. హాంకాంగ్‌పై భారత్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్‌-4కు భారత జట్టు ఆర్హత సాధించింది. భారత విజయంలో సూర్యకుమార్‌ యాదవ్‌(68*), విరాట్‌ కోహ్లి(59*) హాఫ్‌ సెంచరీలతో చేలరేగి కీలక పాత్ర పోషించారు.

ఇదీ చూడండి: సూర్యకుమార్‌ మెరుపులు.. హాంకాంగ్​పై టీమ్​ఇండియా విజయం

Last Updated : Sep 1, 2022, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.