ETV Bharat / sports

Rohit Sharma: 'టెస్టు కెరీర్​లోనే అత్యుత్తమ ఫామ్​లో రోహిత్​'

టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మ (Rohit Sharma) ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్​ చేయగల సమర్థుడని దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ప్రశంసించాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో బ్యాటింగ్​ విభాగాన్ని ముందుండి నడిపిస్తున్నాడని కొనియాడాడు. అతడి ఆటలో పరిణితి కనిపిస్తుందని పేర్కొన్నాడు.

Rohit Sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Aug 21, 2021, 12:06 PM IST

టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మపై (Rohit Sharma) ప్రశంసల వర్షం కురిపించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. ప్రస్తుత ఇంగ్లాండ్​ సిరీస్​లో అతడి బ్యాటింగ్​ తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. అతడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్​ చేయగల సమర్థుడు అంటూ కితాబిచ్చాడు.

"టెస్టుల్లో బ్యాటింగ్​ పరంగా రోహిత్ ప్రస్తుతం​ అత్యుత్తమ ఫామ్​లో ఉన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. ఈ విభాగానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. అతడిలో రెండో కోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. బంతులను వదిలేసే విధానం, డిఫెన్స్​ చేయడం.. అతడి ఆటలో పరిణితి కనిపిస్తుంది. మునుపటితో పోలిస్తే బ్యాటింగ్​లో అతడు చాలా ఎదిగాడు" అని సచిన్​ పేర్కొన్నాడు.

విదేశాల్లో ఇంతవరకు శతకాల ఖాతాను తెరవని రోహిత్.. ఆ అపవాదును అధిగమించే దిశగా బ్యాటింగ్​ చేస్తున్నాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశాలపై సెంచరీలు చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

ఇంగ్లాండ్​తో తొలి రెండు టెస్టుల్లో 36, 12*, 83, 21 పరుగులు చేశాడు రోహిత్​. "రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఓ అద్భుతమైన బంతితో అండర్సన్​ అతని ఆశలపై నీళ్లు చల్లాడు. రోహిత్​ మరో ఓపెనర్​ రాహుల్​కు మంచి సహకారం అందించాడు. దీంతో అతడు లార్డ్స్​లో అద్భుతమైన శతకాన్ని అందుకున్నాడు. ఫుల్​షాట్​ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. నిజం చెప్పాలంటే అతడు ఆడినట్లు ఫుల్​ షాట్​ ఎవరు ఆడలేరు. రెండు టెస్టుల్లో అతడి బ్యాటింగ్​ బాగుంది" అని తెందుల్కర్ తెలిపాడు.

ఐదు టెస్టుల సిరీస్​లో టీమ్ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టు డ్రాగా ముగియగా.. రెండో టెస్టును 151 పరుగుల తేడాతో గెలుపొందింది విరాట్ సేన. తదుపరి మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి లీడ్స్​ వేదికగా ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: భారత క్రికెటర్​పై ఆరోపణలు! పిచ్ రోలర్ దొంగిలించాడంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.