ETV Bharat / sports

క్రికెట్కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాటర్​ - హషీమ్ ఆమ్లా లేటెస్ట్ వార్తలు

దక్షిణాఫ్రికా స్టార్​ బ్యాటర్​ హాషీమ్​ ఆమ్లా.. క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు.

Hashim Amla announces retirement from all forms of cricket

author img

By

Published : Jan 18, 2023, 10:30 PM IST

దక్షిణాఫ్రికా అత్యుత్తమ బ్యాటర్‌లలో ఒకడైన హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల ఆమ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. రెండు దశాబ్దాల కెరీర్‌లో ఆమ్లా ఇప్పటివరకు 181 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 8113 పరుగులు చేశాడు. వీటిలో 27 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. 124 టెస్టులు ఆడిన ఆమ్లా 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలుండగా, 41 హాఫ్ సెంచరీలున్నాయి.

దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడు హషీమ్ ఆమ్లా నిలిచాడు. అతడి ముందు జాక్వెస్ కలిస్ ఉన్నాడు. 2012లో ది ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై ఆమ్లా చేసిన 311 పరుగులు అతడి కెరీర్​లో అత్యుత్తమమైనది. ఇక 44 టీ20ల్లో 1277 రన్స్ చేసి 8 హాఫ్ సెంచరీలు బాదిన ఆమ్లా.. ఐపీఎల్లో పంజాబ్ తరుపున ఆడాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.