టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) సమీపిస్తున్న వేళ.. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను(Hardik Pandya News) ఫినిషర్‌గా ఆడించాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత కొన్ని రోజులుగా పాండ్య ఫామ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. బౌలింగ్‌లో పూర్తిగా రాణించలేకపోయినా.. ఛేజింగ్‌లో ఒత్తిడిని తట్టుకుని టీమ్‌ను గెలిపించే సామర్థ్యం హార్దిక్‌కు(Hardik pandya News Today) ఉందని అభిప్రాయపడ్డాయి.
"బౌలింగ్‌లో హార్దిక్ 100 శాతం ప్రతిభ కనబరచలేకపోతున్నాడు. ఈ కారణంగానే టీ20 ప్రపంచకప్‌లో పాండ్యను ఫినిషర్ బ్యాట్స్‌మన్‌గా పంపాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. గతంలో ఎంఎస్ ధోనీ ఆడిన విధంగానే.. పాండ్య ఫినిషర్ రోల్ తీసుకుంటాడు" అని అధికార వర్గాలు వెల్లడించాయి. బౌలింగ్ మెరుగుపరుచుకునేందుకు హార్దిక్ పూర్తి స్థాయిలో కృషి చేస్తాడని ధీమా వ్యక్తం చేశాయి.
మరోవైపు టీ20 ప్రపంచకప్ టీమ్ఇండియా స్క్వాడ్‌లో(Team India Squad for T20 World Cup) కొన్ని మార్పులు చేసింది బీసీసీఐ. అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. యువ ఆటగాళ్లు ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లక్మన్ మేరివాలా, వెంకటేశ్ అయ్యర్, కరన్ శర్మ, షాబాజ్ అహ్మద్, కృష్ణప్ప గౌతమ్.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తమ సేవల్ని అందించనున్నారని స్పష్టం చేసింది. ఇందుకోసం వారంతా యూఏఈలో ఉన్న టీమ్ఇండియా శిబిరంలో చేరనున్నారు.
ఇదీ చదవండి: