టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వార్మప్ మ్యాచ్‌ల(T20 World Cup Warm-up Matches)ముందు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్. పాండ్య(Hardik Pandya News) బౌలింగ్ తీరు మెరుగుపరుచుకుంటేనే అతడికి ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో(T20 World Cup 2021) చోటు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
"నెట్స్‌లో కాకుండా వార్మప్ మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ మెరుగైన బౌలింగ్ చేయాలి. అలా చేస్తేనే అతడికి ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 11మందితో కూడిన తుది జట్టులో చోటు కల్పించాలి. నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి అసలు పోరులో ఆడటానికి చాలా తేడా ఉంటుంది. ప్రపంచకప్‌లో బాబర్ ఆజామ్ వంటి మేటి బ్యాట్స్‌మన్‌కు బంతులు విసరడం అంటే అంత సులవైన విషయం కాదు."
--గౌతమ్ గంభీర్, మాజీ ఆటగాడు.
2019లో సర్జరీ అనంతరం హార్దిక్ పాండ్య.. ఐపీఎల్లోగాని, జట్టులోగాని రెగ్యులర్‌గా బౌలింగ్‌తో అదరగొట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఈ ఐపీఎల్ సీజన్లోనూ ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడు పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే.. అతడిని బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెబుతున్నారు. మరోవైపు అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న శార్దూల్ ఠాకూర్‌కు జట్టులో చోటు లభించడం గమనార్హం.
ఇదీ చదవండి: