ETV Bharat / sports

దక్షిణాఫ్రికా టీ20 టూర్​కు హార్దిక్​ దూరం- రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్​! - భారత్​ సౌతాఫ్రికా టూర్​ తాజా వార్తలు

Hardik Pandya Vs South Africa : వచ్చేనెల 10 నుంచి డర్బన్​లో సఫారీలతో జరిగే టీ20 ఫార్మాట్​ సిరీస్​కు భారత ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య దూరంగా ఉండనున్నాడని తెలుస్తోంది. పాండ్య స్థానంలో స్టార్​ ప్లేయర్​ రోహిత్​ శర్మ లేదా ప్రస్తుతం ఆసీస్​తో జరుగుతోన్న టీ20 సిరీస్​కు సారథ్యం వహిస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

Hardik Pandya Vs South Africa
Hardik Pandya Vs South Africa
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 5:43 PM IST

Updated : Nov 30, 2023, 6:33 PM IST

Hardik Pandya Vs South Africa : డిసెంబర్​ 10 నుంచి దక్షిణాఫ్రితో​ ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్​కు టీమ్​ఇండియా స్టార్​ ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో రోహిత్​ శర్మకు లేదా ప్రస్తుతం ఆసీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​కు సారథ్య బాధ్యతలు వహిస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు ఈ సిరీస్​ సారథ్య బధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే రోహిత్​ను అభ్యర్థించినట్లు సమాచారం.

అయితే సఫారీలతో జరిగే వైట్​ బాల్​ టోర్నీకి హార్దిక్​ దూరంగా ఉండటానికి ప్రధాన కారణం 2023 ప్రపంచ కప్​లో ఎడమ చీలమండకు గాయం కావడమే. దీనిని నుంచి కోలుకోవడానికి అతడికి మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించనట్లు తెలిసింది. కాగా, 2024, జనవరి 11 నుంచి జనవరి 17 వరకు అఫ్గానిస్థాన్​తో జరిగే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో మాత్రం హార్దిక్​ పాండ్య తిరిగి ఆడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

రోహిత్​ నో చెబితే..?
దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఆడేందుకు బీసీసీఐ ఇప్పటికే రోహిత్​ను సంప్రదించేందుకు యోచిస్తోంది. అయితే ఈ విషయంలో రోహిత్​ సానుకూలంగా స్పందిస్తే గనుక చాలా గ్యాప్​ తర్వాత టీ20 ఫార్మాట్​కు సారథ్య బాధ్యతలు వహించనున్నాడు ఈ హిట్​మ్యాన్​. ఒకవేళ బీసీసీఐ అభ్యర్థనను రోహిత్​ తిరస్కరిస్తే గనుక ప్రస్తుతం ఆసీస్​తో జరుగుతున్న టీ20 సిరీస్​కు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న సూర్యకుమార్​ యాదవ్​కు సఫారీలతో ఆడే జట్టులో కెప్టెన్​గా అవకాశం లభించనుంది. మరోవైపు టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ కూడా సౌతాఫ్రికా వైట్​ బాల్​ సిరీస్​లకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే అతడు తన నిర్ణయాన్ని బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు క్రికెట్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక ఈ టూర్​లో భాగంగా భారత్​-దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి.

స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో ఆడుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్​లో ఇప్పటికే భారత్​ రెండు మ్యాచ్‌లు గెలవగా ఆస్ట్రేలియా ఒకటి గెలిచింది. మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది.

రోహిత్​ - టీమ్ఇండియాకు నువ్వు కావాలయ్యా!

ఓటమి నుంచి పాఠాలు - నాలుగో మ్యాచ్​కు ఆ ముగ్గురు దూరం!

Last Updated : Nov 30, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.