ETV Bharat / sports

'హార్దిక్​ పనైపోయింది.. వారిద్దరిపై దృష్టి పెట్టండి' - hardik pandya

ఫామ్ ​లేమితో సతమతమవుతున్న టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హర్దిక్​ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా ఇద్దరు ఆటగాళ్ల పేర్లను సూచించాడు దిగ్గజ క్రికెటర్​ గావస్కర్. దీపక్ చాహర్, భువనేశ్వర్​ కుమార్ అతడి స్థానాన్ని భర్తీ చేయగలరన్నాడు. వారిద్దరికీ జట్టులో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించాడు.

hardik pandya, sunil gavaskar
హర్దిక్ పాండ్య, సునీల్ గావస్కర్
author img

By

Published : Jul 28, 2021, 9:12 PM IST

ఇటీవల కాలంలో పేలవ ప్రదర్శన చేస్తోన్న టీమ్ఇండియా ఆల్​రౌండర్​ హర్దిక్ పాండ్యాపై దిగ్గజ క్రికెటర్​ సునీల్ గావస్కర్ స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా ఫామ్​లో లేడన్న సన్నీ.. అతని స్థానంలో ఇద్దరు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల పేర్లను సూచించాడు. గాయం అయిన దగ్గరి నుంచి హార్దిక్​ అంతగా రాణించట్లేదని పేర్కొన్నాడు.

"అవును, హర్దిక్​కు ప్రత్యామ్నాయంగా మరో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారు. పొట్టి ప్రపంచకప్​కు ముందు మీరు అతనొక్కడినే పరిగణలోకి తీసుకుంటున్నారు. దీపక్​ చాహర్​, భువనేశ్వర్ కుమార్ అతడి స్థానాన్ని భర్తీ చేయగలరు. వీరిద్దరూ ఆల్​రౌండర్లే. దీపక్​ ఇటీవల రెండో వన్డేలో తనను తాను నిరూపించుకున్నాడు. భువీ కూడా మూడేళ్ల క్రితం లంకతో మ్యాచ్​లో ధోనీతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇప్పుడు కూడా అదే దీపక్- భువీ జోడీ నాటి ఘటనను పునరావృతం చేసింది."

-సునీల్ గావస్కర్, భారత దిగ్గజ క్రికెటర్.

వీరిద్దరికీ పరిమిత ఓవర్ల క్రికెట్​లో తగినన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ఇండియాకు సూచించాడు గావస్కర్. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్​ను దృష్టిలో పెట్టుకున్న భారత్​.. ఆల్​రౌండర్​గా పాండ్యా తిరిగి ఫామ్​ను అందుకోవాలని కోరుకుంటోంది. కానీ, లంకతో పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపికైన అతడు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఆకట్టుకోలేకపోయాడు.

ఇదీ చదవండి: IND vs SL: లంకతో మిగిలిన టీ20లకు వారందరూ దూరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.