ETV Bharat / sports

'సీజన్‌ ముగిసేసరికి నా జుట్టు మొత్తం ఊడుతుందేమో' - IPL 2022 gujarat titans wins

IPL 2022 Hardik pandya: ఈ ఐపీఎల్​ సీజన్‌ ముగిసేసరికి ఒత్తిడితో తన జుట్టు మొత్తం రాలిపోయేలా ఉందని చెప్పాడు గుజరాత్‌ జట్టు కెప్టెన్​ హార్దిక్ పాండ్య. తమ జట్టు విజయాలతో దూసుకెళ్లడానికి గల కారణాలను తెలిపాడు.

IPL 2022 Hardik pandy
IPL 2022 Hardik pandy
author img

By

Published : Apr 25, 2022, 6:50 AM IST

Updated : Apr 25, 2022, 6:58 AM IST

IPL 2022 Hardik pandya: టీ20 మెగా టోర్నీ అంటేనే రసవత్తర పోరాటాలకు వేదిక. చివరి ఓవర్లో ఫలితం తేలే మ్యాచ్‌లకు కొదవలేదు. ఇలాంటి హోరాహోరీ మ్యాచ్‌ల కారణంగా అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లకు తీవ్ర ఒత్తిడి, ఆందోళన తప్పదు. ఇప్పుడు ఈ సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్‌ జట్టు .. ఇప్పటివరకూ గెలిచిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో చివరి ఓవర్లోనే నెగ్గింది. దీంతో ఆ జట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ఈ ఆఖరి ఓవర్‌ ఉత్కంఠపై చమత్కారంగా స్పందిస్తూ.. ఈ సీజన్‌ ముగిసేసరికి ఒత్తిడితో తన జుట్టు మొత్తం రాలిపోయేలా ఉందని నవ్వుతూ చెప్పాడు.

"ఈ సీజన్‌ ముగిసే సరికి బహుశా నా జుట్టు మొత్తం ఊడుతుందేమో! మ్యాచ్‌లను విజయంతో ముగించడం ఎల్లప్పుడూ ముఖ్యమే. ఆ విషయంలో జట్టు ఉత్తమంగా ఉంది. ఆటగాళ్లు తమ వ్యక్తిత్వం, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ జట్టును గెలిపిస్తున్నారు. కోల్‌కతాతో మ్యాచ్‌లో మేం ఓ పన్నెండు పరుగులు తక్కువే చేశాం. ప్రత్యర్థి బౌలర్లు మెరుగ్గా బంతులేశారు. కానీ మాకున్న బౌలింగ్‌ బలాన్ని నేను నమ్మా. ఆ పరుగులను అడ్డుకునే దిశగా మా బౌలర్లకు మద్దతుగా నిలిచా. చివరకు మేం అనుకున్నది సాధించాం. ఓపెనర్లు గిల్, సాహాకు జట్టు అండగా ఉంటుంది. వాళ్లు ఎలాంటి ఆటగాళ్లో నాకు తెలుసు. మా మిడిలార్డర్‌ రాణిస్తోంది. ఓపెనర్లు కూడా జోరందుకుంటే జట్టు బ్యాటింగ్‌ చూడ్డానికి కనువిందుగా ఉంటుంది. నా గాయం గురించి ఇప్పటికైతే ఆందోళన లేదు’’ అని హార్దిక్‌ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: రాతమారని ముంబయి.. ఎనిమిదో ఓటమితో టోర్నీ నుంచి ఔట్

Last Updated : Apr 25, 2022, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.