Harbhajan praises Kohli: టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ధోనీలా కూల్‌గా ఉంటే అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని పరుగులు చేసేవాడు కాదని మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ అన్నాడు. అతడి దూకుడు స్వభావం కారణంగానే భారత జట్టు విదేశాల్లో కూడా సిరీస్‌లు సాధించగలుగుతోందని పేర్కొన్నాడు.
"విరాట్ కోహ్లీ స్వభావం భారత క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుంది. టీమ్‌ఇండియాను ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి ఆటగాళ్లు చాలా అవసరం. కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తే సిరీస్‌ను ఎలా కాపాడుకోవాలా.? అని ఆలోచించే వాళ్లం. కానీ, కోహ్లీ నాయకత్వంలో ఆటగాళ్ల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియాలో సిరీస్ ఎలా గెలవాలా.? అని ఆలోచిస్తున్నారు. కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను సొంత గడ్డపై ఓడించింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఆధిక్యంలో నిలిచారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా టూర్‌లో కూడా భారత్ గెలుస్తుందనే ఆశిస్తున్నాను."
-హర్భజన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"గతంలో ఓ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 400కి పైగా లక్ష్యన్ని ఛేదించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీ భారీ శతకం బాదినా.. సిరీస్ నిలబెట్టుకోలేకపోయింది. కోహ్లీ ఔటయ్యాక మ్యాచ్ డ్రా అవుతుందని నేను చెప్పాను. అప్పుడు కోహ్లీ.. 'డ్రాగా ముగిసే మ్యాచ్‌లకు విలువ లేదు. టెస్టుల్లో గెలవాలి లేదా ఓడిపోవాలి. అయితే, చివరి వరకు గెలుపు కోసం పోరాడటం నేర్చుకుంటే.. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాం' అని చెప్పాడు. దూకుడు స్వభావం కారణంగానే కోహ్లీ దిగ్గజ ఆటగాడిగా పేరు సంపాదించాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలా కూల్‌గా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని పరుగులు చేసేవాడు కాదు" అని హర్భజన్ అన్నాడు.