ETV Bharat / sports

Chris Woakes: 'లక్ష్యం పెద్దదే.. కానీ ఛేదించగలం' - ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా లైవ్ స్కోర్

నాలుగో టెస్టు (INDvsENG) ఆఖరి రోజున 291 పరుగులు చేయడం కష్టమైన పనే అని అన్నాడు ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). అయితే భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమ జట్టుకు ఉందని, టీమ్​ఇండియాపై సమష్టి కృషితో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తంచేశాడు.

Chris Woakes
క్రిస్ వోక్స్
author img

By

Published : Sep 6, 2021, 12:24 PM IST

టీమ్‌ఇండియా నిర్దేశించిన 368 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఛేదించగలదని ఆల్‌రౌండర్‌ క్రిస్‌వోక్స్‌ (Chris Woakes) ధీమా వ్యక్తం చేశాడు. గతంలో భారీ లక్ష్యాలను ఛేదించిన అనుభవం తమకు ఉందన్నాడు. నాలుగో రోజు ఆఖర్లో తాము వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేశామని గుర్తుచేశాడు. జట్టు సమష్టిగా ఆడితే గెలుపు కష్టమేమీ కాదని అంటున్నాడు.

"గొప్ప టెస్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏదేమైనా తొలి రెండు రోజులతో పోలిస్తే ఆఖరి రెండు రోజులు టెస్టు క్రికెట్లో ఎక్కువ కష్టపడాలి. మేం ఎక్కువ గంటలు ఫీల్డింగ్‌ చేశాం. అలసిపోయినా మా ఓపెనర్లు అజేయంగా నిలవడం అభినందనీయం. ఆఖరి రోజు కీలకం కానుంది. ఆఖరి రోజు పిచ్‌పై 291 పరుగులు చేయడం కష్టమైన పనే! కానీ వికెట్‌ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని గుర్తుంచుకోవాలి. రోజంతా బ్యాటింగ్‌ చేస్తే మేం గెలవగలం. ఆ నమ్మకం మాకుంది. ఇందుకెంతో శ్రమించాలి"

-క్రిస్‌వోక్స్‌, ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్

నాలుగో టెస్టు (INDvsENG fourth test) రెండో ఇన్నింగ్స్‌లో టీమ్​ఇండియా 466 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ పరుగుల లోటు మినహాయించి 368 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. బదులుగా ఆదివారం ఆట ముగిసే సరికి ఆంగ్లేయులు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. ఓపెనర్లు హసీబ్‌ హమీద్‌ (43), రోరీ బర్న్స్‌ (31) అజేయంగా నిలిచారు. ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే సోమవారం ఇంకా 291 పరుగులు చేయాలి.

ఇంగ్లాండ్‌ తన సొంతగడ్డపై ఇప్పటి వరకు ఛేదించిన అత్యధిక స్కోరు 362/9. హెడింగ్లే వేదికగా ఆఖరి వికెట్‌ను కాచుకొని బెన్‌స్టోక్స్‌ 135 పరుగులతో అజేయంగా నిలవడం వల్ల ఆ గెలుపు దక్కింది. అతడి బ్యాటింగ్‌ యాషెస్‌ సిరీసును మలుపుతిప్పింది. ఇక గతేడాది పాక్‌ నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఆంగ్లేయులు ఛేదించారు. క్రిస్‌వోక్స్‌ 84తో అజేయంగా నిలిచాడు.

"మా గత అనుభవాలు ఇప్పుడు ఉపయోగపడతాయి. జట్టుగా మేమిది చేయగలం. నమ్మకంతో ఆడటమే ముఖ్యం. గతంలో వేర్వేరు ఫార్మాట్లలో ఈ జట్టు అద్భుతాలు చేసింది. పిచ్‌ కాస్త మెరుగ్గా అనిపించడం వల్ల ఫాస్ట్‌ బౌలర్లమైన మేం ఎక్కువగా బంతులు వేయాల్సి వచ్చింది. 45కు పైగా ఓవర్లు విసిరాం. వికెట్లు తీసేందుకు శ్రమించాం. చాలామందిమి అలిసిపోయాం. పుంజుకొని సోమవారం బాగా ఆడతామన్న విశ్వాసం ఉంది" అని వోక్స్‌ తెలిపాడు.

ఇదీ చూడండి: Ind vs Eng: 'ఇలాంటి టెస్ట్​ సిరీస్​లకు ఏదీ సాటి రాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.