ETV Bharat / sports

గిల్ డబుల్ సెంచరీ.. స్టేడియంలో 'సారా..సారా' స్లోగన్స్​.. వీడియోలు చూశారా? - శుభ్​మన్​ గిల్​ సారా అలీ ఖాన్​

కివీస్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా యంగ్​ ప్లేయర్​ శుభమన్​ గిల్ విజృంభించాడు. అయితే గిల్​ ఫీల్డింగ్​ చేస్తున్న సమయంలో ఫ్యాన్స్​.. 'సారా.. సారా' అంటూ నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్​గా మారాయి. వాటిని మీరూ చూసేయండి.

subhman gill viral video
subhman gill viral video
author img

By

Published : Jan 19, 2023, 4:12 PM IST

హైదరాబాద్​లోని ఉప్పల్​ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టేశాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అద్భుతంగా ఆడి డబుల్ సెంచరీ సాధించాడు. గిల్​ విజృంభణతో తొలి మ్యాచ్‌లో టీమ్​ఇండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో గిల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

దీంతో సోషల్​మీడియా గిల్​ పేరు ఫుల్​ ట్రెండింగ్​లోకి ఉంది. గిల్​ బ్యాటింగ్​ హైలెట్స్​ను అందరూ షేర్​ చేస్తూ తెగ పొగిడేస్తున్నారు. ఈ క్రమంలో మరో వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. న్యూజిలాండ్​ బ్యాటింగ్​ చేస్తున్న సమయంలో గిల్​ ఫీల్డింగ్​కు వచ్చాడు. అప్పుడు స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​ ఒక్కసారిగా 'సారా.. సారా' అంటూ నినాదాలు చేశారు.

అయితే ఈ సారా సచిన్​ కుమర్తె సారా తెందూల్కరా లేక సారా అలీ ఖానా అన్న విషయం తెలియట్లేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియోపై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికైనా లవ్​ మ్యాటర్​ చెప్పు సామీ అంటూ సరదాగా రిక్వెస్ట్​ చేస్తున్నారు. డబుల్​ సెంచరీ బాదిన సచిన్​ అల్లుడంటూ మీమ్స్​ తెగ వైరల్​ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.