ETV Bharat / sports

'పంత్​ బ్యాటింగ్​లో ప్రతిభాశాలే.. కీపింగ్​లో మాత్రం'

భారత వికెట్​ కీపర్​, బ్యాట్స్​మెన్​ రిషభ్​ పంత్​పై ప్రశంసలు కురిపించాడు మాజీ ఆటగాడు, వికెట్​ కీపర్​ సయ్యద్​ కిర్మాణి. అయితే.. పంత్​ ఇంకా ఎంతో నేర్చుకోవాలని అన్నాడు. బ్యాటింగ్​లో మాత్రం ప్రతిభాశాలి అని కొనియాడాడు.

author img

By

Published : Feb 9, 2021, 10:41 PM IST

బ్యాట్స్‌మన్‌గా రిషభ్‌పంత్‌ సహజ ప్రతిభాశాలి అని టీమ్‌ఇండియా మాజీ వికెట్‌కీపర్‌ సయ్యద్‌ కిర్మాణి అన్నాడు. వికెట్‌కీపింగ్‌లో మాత్రం ఇంకా శైశవ దశలోనే ఉన్నాడని పేర్కొన్నాడు. వికెట్ల వెనకాల ప్రాథమిక అంశాల్లో అతడు మెరుగవ్వాలని సూచించాడు. తక్కువ వయసే కాబట్టి కాలం గడిచే కొద్దీ పరిణతి సాధిస్తాడని వెల్లడించాడు.

'రిషభ్‌ పంత్‌ ప్రతిభావంతుడు. సహజసిద్ధ స్ట్రోక్‌ ప్లేయర్‌. వికెట్‌ కీపింగ్‌లో ఇంకా శైశవ దశలోనే ఉన్నాడు. అతడెంతో నేర్చుకోవాలి. ఎప్పుడు రక్షణాత్మకంగా ఆడాలి, ఎప్పుడు దూకుడుగా ఆడాలో తెలుసుకోవాలి. వికెట్‌ కీపింగ్‌లో ప్రాథమికంగా సరిగ్గా ఉండాలి. ఇప్పుడలా లేడు. స్టంప్స్‌ సమీపంలో కీపింగ్‌ చేస్తున్నప్పుడే కీపర్‌ సత్తాను అంచనా వేయగలం. ఫాస్ట్‌ బౌలింగ్‌లో ఎవరైనా కీపింగ్‌ చేయగలరు. బంతి ఎలా వస్తుందో తెలుస్తుంది. సమయం ఉంటుంది. దూరంగా ఉంటారు. బంతిని బట్టి కదలొచ్చు, అందుకోవచ్చు.' అని కిర్మాణి అన్నాడు.

'బ్రిస్బేన్‌లో రిషభ్ ఇన్నింగ్స్‌ సాధికారికంగా ఉంది. తొలిసారి అతడు జట్టును గెలిపించాడు. గతంలో జట్టును గెలిపించే అవకాశాలు వచ్చినా అతడు వికెట్‌ పారేసుకున్నాడు. చెన్నైలోనూ అంతే. బ్యాట్స్‌మన్‌ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు శతకంపై దృష్టిపెట్టాలి. సాహసం చేయకూడదు. దూకుడుగా ఆడటం సహజశైలి అని కబుర్లు చెప్పొద్దు. పరిస్థితులను బట్టి ఆడాలి. ఆస్ట్రేలియాలో అతడు చక్కగా ఆడాడు. అడ్డుకోవాల్సిన సమయంలో బంతిని డిఫెండ్‌ చేశాడు. అవసరమైనప్పుడు షాట్లు ఆడాడు. ఇదంతా అనుభవం ద్వారా వస్తుంది. అతడింకా 20ల్లోనే ఉన్నాడు. పరిణతి రావాలంటే కనీసం 30 ఏళ్లు పడుతుంది. ఈ క్రమంలో అతడు అన్నింటా పరిణతి సాధించగలడు.' అని కిర్మాణి వెల్లడించాడు.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​ వరద బాధితులకు పంత్​ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.