ETV Bharat / sports

'టీమ్ఇండియా కంటే ముంబయి ఇండియన్స్​ ఉత్తమం' - మైకేల్​ వాన్​ ట్వీట్

టీమ్ఇండియా కంటే ముంబయి ఇండియన్స్ జట్టు ఎంతో ఉత్తమమైనదని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​. శుక్రవారం ఇంగ్లిష్​ జట్టుతో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన తక్కువ పరుగులకే పరిమితమవ్వడంపై ఈ విధంగా విమర్శించాడు.

Michael Vaughan trolls India, says Mumbai Indians are better than Kohli's India
'టీమ్ఇండియా కంటే ముంబయి ఇండియన్స్​ ఉత్తమం'
author img

By

Published : Mar 12, 2021, 10:47 PM IST

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్​ వాన్​ మరోసారి టీమ్ఇండియాపై విమర్శలతో విరుచుపడ్డాడు. ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన అతితక్కువ స్కోరుకే పరిమితమవ్వడంపై వాన్​ స్పందిస్తూ.. భారత జట్టు కంటే ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టు ఎంతో మేలని ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

"భారత టీ20 జట్టు​ కంటే ముంబయి ఇండియన్స్​ చాలా ఉత్తమమైన జట్టు" అని మైఖేల్​ వాన్​ ట్వీట్​ చేశాడు.

టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన టీమ్ఇండియా ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన శ్రేయస్​ అయ్యర్​ (67) అర్ధశతకంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో సహాయపడ్డాడు. ఇంగ్లాండ్​ బౌలర్ల ధాటికి కోహ్లీసేన 7 వికెట్లు నష్టపోయి 124 పరుగులు చేసింది.

ఆ తర్వాత 125 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన మోర్గాన్​ సేన రెండు వికెట్లు నష్టపోయి 15.3 ఓవర్లలో పూర్తిచేసింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై విజయం సాధించింది.

ఇదీ చూడండి: ఇంగ్లాండ్​ ఆల్​రౌండ్​ ప్రదర్శన.. భారత్​కు తప్పని ఓటమి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.