చెపాక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కష్టాల్లో చిక్కుకుంది. రెండో రోజు భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్(8) నాటౌట్‌గా ఉన్నాడు. ఇప్పటికే అశ్విన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ను తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు ఇషాంత్. సున్నా పరుగులకే ఓపెనర్ రోరీ బర్న్స్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో స్కోరు బోర్డుపై పరుగుల ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్ వికెట్ నష్టపోయింది. డామ్ సిబ్లీని అశ్విన్ వెనక్కిపంపాడు. కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న జో రూట్‌ను ఊరించే బంతితో పెవిలియన్ బాట పట్టించాడు అక్షర్. కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న అక్షర్ వేసిన బంతిని రూట్ స్వీప్ చేశాడు. గాల్లోకి ఎగిరిన బంతిని అశ్విన్ ఒడిసిపట్టాడు. లంచ్‌కు ముందు చివరి బంతికి లారెన్స్‌ను అశ్విన్ ఔట్ చేశాడు.
అంతకుముందు.. ఓవర్‌నైట్ స్కోర్ 300/6తో బ్యాటింగ్ కొనసాగించిన భారత్.. మరో 29 పరుగులు చేసి.. చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ పంత్‌కు సహకారం అందించలేదు. పరిస్థితిని ఊహించిన పంత్.. ఉన్నంత సేపు ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4, స్టోన్ 3, లీచ్ 2 వికెట్లు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్.. 157కే ఆలౌట్: వార్న్