ETV Bharat / sports

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్​ 24/1 - India trail by 181 Runs

అహ్మదాబాద్​ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్​ కోల్పోయిన భారత్​.. 24 పరుగులు చేసింది. అంతకుముందుకు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​.. భారత బౌలర్ల ధాటికి 205 రన్స్​కు ఆలౌటైంది.

India Vs England
ఇండియా Vs ఇంగ్లాండ్​
author img

By

Published : Mar 4, 2021, 4:58 PM IST

Updated : Mar 4, 2021, 5:08 PM IST

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 24 పరుగులు చేసింది. ఆఖరి 12 ఓవర్లను ఇంగ్లాండ్‌ కట్టుదిట్టంగా విసిరింది. రోహిత్‌ శర్మ (8), చెతేశ్వర్‌ పుజారా (15) ప్రస్తుతం క్రీజ్​లో ఉన్నారు. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ ఇన్నింగ్స్​ ఆరంభంలోనే డకౌట్​గా వెనుదిరిగాడు. భారత్‌ ఇంకా 181 పరుగుల లోటుతో ఉంది.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ప్రత్యర్థి జట్టు 75.5 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌట్​ అయ్యింది. టీమ్‌ఇండియా స్పిన్నర్లు అక్షర్‌ పటేల్ (4)‌, రవిచంద్రన్‌ అశ్విన్ (3)‌ ఇంగ్లీష్​ జట్టుపై మరోసారి ఆధిపత్యాన్ని కొనసాగించారు. తమదైన వైవిధ్యం ప్రదర్శిస్తూ చక్కని స్పిన్‌తో వణికించారు.

Last Updated : Mar 4, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.