ETV Bharat / sports

ఫీల్డింగ్​లో కనపడని పుజారా.. ఆ గాయమే కారణమా? - గాయంతో ఫీల్డింగ్​కు దిగని పుజారా

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో భారత నయావాల్​ పుజారా ఫీల్డింగ్​కు దిగలేదు. తొలి రోజు బ్యాటింగ్​ చేస్తూ గాయపడ్డ అతడు మైదానంలోకి దిగలేదని బీసీసీఐ వెల్లడించింది.

Blow on right hand while batting keeps Pujara away from fielding in England's innings
గాయం కారణంగా ఫీల్డింగ్​కు దిగని పుజారా
author img

By

Published : Feb 14, 2021, 12:34 PM IST

టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ ఛెతేశ్వర్​ పుజారా..​ చెపాక్​ టెస్టులో ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో ఫీల్డింగ్​కు దిగలేదు. మొదటి రోజు బ్యాటింగ్​ చేస్తుండగా గాయపడ్డ అతని స్థానంలో రిజర్వ్ ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​ మైదానంలోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న రెండో టెస్టులో తొలి రోజు బ్యాటింగ్​ చేస్తుండగా పుజారా కుడిచేతికి గాయమైంది. ఆ తర్వాత నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్​లో అతడు ఫీల్డింగ్​కు దిగలేదు అని స్పష్టం చేసింది.

కాగా, మొదటి ఇన్నింగ్స్​లో భారత్​ 329 పరుగులకు ఆలౌటయ్యింది. పుజారా 58 బంతుల్లో 21 పరుగులు చేశాడు. గత ఆస్ట్రేలియా సిరీస్​లోనూ పుజారాకు చాలా దెబ్బలు తగిలాయి. అయినా వాటిని తట్టుకుని ఇండియా చారిత్రక విజయం సాధించడంలో భాగమయ్యాడు.

ఇదీ చదవండి: రితికకు గిఫ్ట్​.. ఇవి రోహిత్​ 'వాలెంటైన్స్'​ శతకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.