ETV Bharat / sports

పాక్​పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు - పాక్​పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు

టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్​లో ఐదు వికెట్లు తీస్తేనే గొప్పగా చెప్పుకుంటాం. అదే పదికి పది వికెట్లు తీస్తే.. అదీ ప్రత్యర్థి దాయాది జట్టుపై అయితే.. ఆ రికార్డు 22 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉంటే సూపర్​ కదా. ఆ ఫీట్​ మరేవరిదో కాదు.. భారత స్పిన్​ దిగ్గజం అనిల్​ కుంబ్లేది.

anil kumble became the only second bowler in test history to take all 10 wickets in an innings
పాక్​పై కుంబ్లే 'పది వికెట్ల రికార్డు'కు 22 ఏళ్లు
author img

By

Published : Feb 7, 2021, 10:43 AM IST

1999 ఫిబ్రవరి 7.. భారత దిగ్గజ స్పిన్నర్​ అనిల్​ కుంబ్లే కెరీర్​లో మరిచిపోలేని రోజు.. ఎందుకంటారా? క్రికెట్​ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డును జంబూ ఆ రోజే సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్​ బౌలర్​ జిమ్​ లేకర్​ తర్వాత టెస్టు ఇన్నింగ్స్​లో పది వికెట్లు తీసిన రెండో బౌలర్​గా కుంబ్లే రికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్​ సాధించి నేటికి 22 ఏళ్లు పూర్తయింది.

దిల్లీలోని అరుణ్​ జైట్లీ క్రికెట్​ స్టేడియం(ఫిరోజ్​ షా కోట్ల మైదానం) వేదికగా.. పాకిస్థాన్​తో జరిగిన టెస్టు మ్యాచ్​లో కుంబ్లే ఈ ఫీట్​ సాధించాడు. మొదట బ్యాటింగ్​ చేసిన భారత్​ 420 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్​కు దిగిన పాక్ ఓపెనర్లు​.. తొలి వికెట్​కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. తర్వాత కుంబ్లే ధాటికి దాయాది​ బ్యాట్స్​మెన్ కుప్పకూలారు. ఈ మ్యాచ్​లో ఇండియా 212 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇన్నింగ్స్​ మొత్తం 26.3 ఓవర్ల పాటు బౌలింగ్​ చేసిన కుంబ్లే 74 పరుగులు ఇచ్చి పది వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 9 మెయిడెన్​ ఓవర్లూ ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుంబ్లే మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్​(800), ఆస్ట్రేలియా బౌలింగ్​ లెజెండ్​ షేన్​ వార్న్​(708) తర్వాత కుంబ్లే(619) కొనసాగుతున్నాడు.

ఇదీ చదవండి: రేపటి నుంచే ఆస్ట్రేలియన్​ ఓపెన్​.. ఫేవరెట్​ జకోవిచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.