ETV Bharat / sports

ప్రముఖ ఇంగ్లాండ్​ పేసర్​​ టెస్టు క్రికెట్​కు గుడ్​బై - కేథరిన్​

England katherine retirement: ఇంగ్లాండ్​ మహిళా పేసర్​ కేథరిన్​ బ్రుంట్​ టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించింది. వైట్​బాల్​ ఫార్మాట్​లో మరింత బాగా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

England pacer katherine retirement
కేథరిన్​ బ్రుంట్​ టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్
author img

By

Published : Jun 19, 2022, 8:40 AM IST

Updated : Jun 19, 2022, 9:11 AM IST

England katherine retirement: ఇంగ్లాండ్​ మహిళా పేసర్​ కేథరిన్​ బ్రుంట్​ టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికింది. 17ఏళ్ల పాటు ఈ ఫార్మాట్​లో ఆడిన ఈ క్రికెటర్​.. పొట్టి ఫార్మాట్​లో మాత్రం ఆటను కొనసాగిస్తానంది. టెస్టు క్రికెట్​ తనకు బాగా ఇష్టమైనప్పటికీ..​ వైట్​బాల్​ క్రికెట్​లో మరింత బాగా రాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీన్ని 'స్మార్ట్​ డెసిషన్​'గా పేర్కొంది.

కాగా, 2004లో టెస్టులో అరంగేట్రం చేసిన కేథరిన్​.. తన మూడు మ్యాచ్​కే జట్టులో కీలక ప్లేయర్​గా నిలిచింది. మొత్తంగా 14 టెస్టులు ఆడి 2.52 ఎకానమీ, 21.5 సగటుతో 51 వికెట్లు తీయగా.. 13.1 యావరేజ్​తో 184 పరుగులు చేసింది. ఇందులో ఒక్క హాఫ్​ సెంచరీ, 21 ఫోర్లు ఉన్నాయి. ఇటీవలే కేథరిన్​.. తన ప్రేయసి, తోటి మహిళా ప్లేయర్​ నాట్‌ స్కీవర్​ని వివాహం చేసుకుంది.

ఇదీ చూడండి: లవ్​స్టోరీ సక్సెస్​.. పెళ్లి చేసుకున్న ఇద్దరు 'మహిళా క్రికెటర్లు'

Last Updated : Jun 19, 2022, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.