ETV Bharat / sports

వచ్చే ఏడాది పాక్ పర్యటనకు ఇంగ్లాండ్.. ఈసీబీ క్లారిటీ - వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పాకిస్థాన్ సిరీస్

పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(pak eng series). దీనిపై పీసీబీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈసీబీ చీఫ్ ఇయాన్ వాట్​మోర్ వచ్చే ఏడాది పర్యటనకు వస్తామని హామీ ఇచ్చారు.

ECB
ఈసీబీ
author img

By

Published : Sep 29, 2021, 5:05 PM IST

పాకిస్థాన్​ పర్యటన నుంచి తప్పుకొని పీసీబీకి షాకిచ్చింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(pak nz 2021). భద్రత కారణాల దృష్ట్యా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పాక్​తో సిరీస్​ను ఇంగ్లాండ్(pak eng series) కూడా రద్దు చేసుకుంది. దానికి సంబంధించిన కారణాలు సరిగా వెల్లడించకపోయినా ఆటగాళ్ల సంక్షేమమే ముఖ్యమని తెలిపింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన పీసీబీ ఈ నిర్ణయం తమని బాధించిందని వెల్లడించింది. ఇంగ్లాండ్ బోర్డు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. తాజాగా ఈ విషయంపై స్పందించారు ఈసీబీ చీఫ్ ఇయాన్ వాట్​మోర్. పర్యటనను దూరం చేసుకున్నందుకు క్షమాపణలు చెప్పారు.

"మా నిర్ణయంతో ఎవరైనా బాధపడితే క్షమాపణలు చెబుతున్నా. మా ఆటగాళ్ల మానసిక, ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఏడాది పాకిస్థాన్​లో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించిన ప్రణాళికల్ని రూపొందిస్తాం."

-ఇయాన్ వాట్​మోర్, ఈసీబీ చీఫ్

ఈసీబీ చీఫ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు పాకిస్థాన్ సమాచార, బ్రాడ్​కాస్టింగ్ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి. "వచ్చే ఏడాది పాకిస్థాన్​లో పర్యటిస్తానన్న ఈసీబీ నిర్ణయం ఆహ్వానించదగింది. ఈ సిరీస్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" అని వెల్లడించారు.

అక్టోబర్​లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది ఇంగ్లాండ్ మహిళా, పురుషుల జట్లు. టీ20 ప్రపంచకప్​నకు ముందు పురుషుల జట్ల మధ్య రెండు టీ20లు, మహిళలు రెండు టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

ఇవీ చూడండి: కోహ్లీ కెప్టెన్సీ తొలగింపుపై పుకార్లు.. బీసీసీఐ ఏమందంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.