Duleep trophy winner : దులీప్ ట్రోఫీని సౌత్ జోన్ ఎగరేసుకెళ్లింది. హోరా హోరీగా జరిగిన ఈ ఫైనల్‌లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ సేన సూపర్ విక్టరీ సాధించింది. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్ జోన్.. 222 పరుగులకే ఆలౌటైంది. దీంతో హనుమ విహారి నాయకత్వంలోని సౌత్ జోన్ కప్‌ను ముద్దాడింది.
సౌత్ జోన్ తొలి, రెండు ఇన్నింగ్స్‌లు 213/10, 230/10. వెస్ట్ జోన్ 146/10, 222/10. ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, సిరీస్‌గా సౌత్ జోన్ ఆటగాడు విధ్వత్ కావేరప్ప నిలిచాడు. కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినప్పటికీ.. వెస్ట్ జోన్‌కు ఓటమి తప్పలేదు. ఇక వాసుకి కౌశిక్ (4/36), సాయి కిశోర్ (4/57), విద్వత్ కావేరప్ప (1/51), వైశాక్ (1/39) దెబ్బకు వెస్ట్ జోన్ బెంబేలెత్తింది.
అయితే సౌత్‌జోన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే వెస్ట్ జోన్ ఆలౌట్ చేసింది. కానీ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలం కావడం వల్ల వెస్ట్‌జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్‌ను దెబ్బకొట్టాడు. మరోవైపు ఛతేశ్వర్ పుజారా, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్‌ఖాన్ వంటి టాప్ బ్యాటర్లు ఉన్నప్పటికీ కావేరప్ప ధాటికి క్రీజులో నిలవలేకపోయారు.
సూర్యకుమార్ యాదవ్ (8, 4), పుజారా (4, 15) రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తమ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌత్ జోన్.. 230 పరుగులకు ఆలౌటైంది. అలా వెస్ట్‌జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఆ తర్వాత మైదానంలోకి దిగిన వెస్ట్‌జోన్.. 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంత చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు సౌత్‌జోన్ 12 టైటిళ్లను తన ఖాతాలో వేసుకుంది.
స్కోరు వివరాలు:
సౌత్ జోన్: తొలి ఇన్నింగ్స్ 213, రెండో ఇన్నింగ్స్ 230.
వెస్ట్ జోన్: తొలి ఇన్నింగ్స్ 146. రెండో ఇన్నింగ్స్ 222.
-
WHAT. A. WIN 🙌🙌
— BCCI Domestic (@BCCIdomestic) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
South Zone beat West Zone by 75 runs to lift the #DuleepTrophy at the M Chinnaswamy Stadium in Bengaluru 👏👏#WZvSZ | #Final
💻 Scorecard - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/mSuHfxIJ6w
">WHAT. A. WIN 🙌🙌
— BCCI Domestic (@BCCIdomestic) July 16, 2023
South Zone beat West Zone by 75 runs to lift the #DuleepTrophy at the M Chinnaswamy Stadium in Bengaluru 👏👏#WZvSZ | #Final
💻 Scorecard - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/mSuHfxIJ6wWHAT. A. WIN 🙌🙌
— BCCI Domestic (@BCCIdomestic) July 16, 2023
South Zone beat West Zone by 75 runs to lift the #DuleepTrophy at the M Chinnaswamy Stadium in Bengaluru 👏👏#WZvSZ | #Final
💻 Scorecard - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/mSuHfxIJ6w