ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ చివరిసారిగా 2007లో గెలిచింది. అప్పుడు టీమ్ఇండియాకు మాజీ క్రికెటర్ ద్రవిడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు.. ఆ టెస్టు సిరీస్‌ను గుర్తుచేసుకున్నాడు. ఆగస్టు 4న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. ఈ నేపథ్యంలో గతాన్ని గుర్తుచేసుకున్న ద్రవిడ్.. ఈ సారి జరగబోయే సిరీస్‌లో భారత జట్టు గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. ఈ సిరీస్‌లో అశ్విన్, బెన్‌స్టోక్స్ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందన్నాడు.
"ఇంగ్లాండ్ బౌలింగ్ గురించి ఎటువంటి సందేహం అక్కర్లేదు. వారి సీమ్ బౌలింగ్ దాడి అద్భుతంగా ఉంటుంది. ఆ జట్టులో ఎవరికి అవకాశమిచ్చినా తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. టాప్-7లో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ జో రూట్ ఉన్నాడు. స్టోక్స్ మంచి ఆల్‌రౌండర్. అయితే వారిని అశ్విన్ బాగా ఎదుర్కోగలడు. వీరిమధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. భారత్‌లో సిరీస్ జరిగినప్పుడు స్టోక్స్‌పై అశ్విన్ ఎలా ఆడాడో చూశాం. ఆస్ట్రేలియాపై విజయంతో టీమ్ఇండియా ఆటగాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఇప్పటికే జ్టటులో ఎంపికైన భారత ఆటగాళ్లకు అంతకుముందు ప్రత్యర్థి జట్టుతో వారి సొంత గడ్డపై ఆడిన అనుభవం ఉంది. ఈ సిరీస్‌కు ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఆడనుంది టీమ్ఇండియా. ఈ రెండింటి మధ్య దాదాపు నెలరోజులకు పైగా ప్రాక్టీస్‌కు సమయం దొరుకుతుంది. కాబట్టి ఈ సారి 3-2తేడాతో భారత జట్టు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. " అని ద్రవిడ్ వివరించాడు.