Dhoni World Cup 2023 News : ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచ కప్ 2023లో టీమ్‌ఇండియా వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి దూసుకెళ్తోంది. మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. లఖ్‌నవూ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ వ్యక్తిగత ప్రదర్శన, అతడు జట్టును నడిపిస్తున్న తీరుతో.. మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి ఎలాగైనా టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా కెప్టెన్ కూల్ ధోనీ మొదటి భారత్ విజయావకాశాలపై స్పందించాడు. దీంతో పాటే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆడటంపైనా కూడా ఓ హిట్ ఇచ్చాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
"ప్రస్తుతం ప్రపంచ కప్‌లో ఆడుతున్న టీమ్‌ఇండియా చాలా బాగుంది. సమతూకంగా అన్ని విభాగాలూ పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. ప్లేయర్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతకన్నా నేను ఎక్కువగా చెప్పలేను. కచ్చితంగా మనకు మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నాను. 2019లో కాస్తలో ఓడిపోయి సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టడం ఇప్పటికీ బాధగానే ఉంది. అలాంటి ఎమోషన్స్‌ను నియత్రించుకోవడం చాలా కష్టమే. టీమ్ ఇండియా తరఫున ఇదే నా చివరి మ్యాచ్ అయింది. అప్పటికే నేను గుడ్ బై చెప్పేయాలని భావించాను. ఏడాది తర్వాత అనౌన్స్ చేశాను. దాదాపు 15 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి వీడ్కోలు చెప్పడం చాలా బాధగా అనిపించింది. అయనా ఎప్పుడో ఒకప్పుడు అలాంటి రోజు ప్రతి క్రికెటర్ కెరీర్‌లో రావాల్సిందే" అని ఆయన అన్నారు.
ఐపీఎల్‌పై.. మహీ ఐదుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే, వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోనీ ఫ్యాన్స్‌కు పరోక్షంగా గుడ్ న్యూస్ చెప్పాడు. "మోకాలి సర్జరీ తర్వాత వేగంగానే కోలుకుంటున్నాను. ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బందు లేవు. రోజువారీ కార్యక్రమాల్లోనూ చురుగ్గానే పాల్గొంటున్నాను. వచ్చే నెల కల్లా ఇంకా మెరుగవుతాననే నమ్మకం నాకు ఉంది. అద్భుతమైన క్రికెటర్‌గా కాకుండా.. ఓ మంచి వ్యక్తిగా నన్ను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడూ అనుకుంటున్నాను. ఇలా జరగాలంటే చివరి వరకూ ఒకే వ్యక్తిత్వంతో ముందుకు సాగుతూ వెళ్లాలి" అని ధోనీ పేర్కొన్నాడు.
-
Huge congratulations to #TeamIndia on their stunning 5th consecutive win in #CWC2023! 🇮🇳 @MdShami11's 5-wicket haul, @imVkohli's and @imjadeja’s brilliant batting anchored the victory. Let's maintain this winning momentum and march ahead! @BCCI pic.twitter.com/xwYGiFneAG
— Jay Shah (@JayShah) October 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Huge congratulations to #TeamIndia on their stunning 5th consecutive win in #CWC2023! 🇮🇳 @MdShami11's 5-wicket haul, @imVkohli's and @imjadeja’s brilliant batting anchored the victory. Let's maintain this winning momentum and march ahead! @BCCI pic.twitter.com/xwYGiFneAG
— Jay Shah (@JayShah) October 22, 2023Huge congratulations to #TeamIndia on their stunning 5th consecutive win in #CWC2023! 🇮🇳 @MdShami11's 5-wicket haul, @imVkohli's and @imjadeja’s brilliant batting anchored the victory. Let's maintain this winning momentum and march ahead! @BCCI pic.twitter.com/xwYGiFneAG
— Jay Shah (@JayShah) October 22, 2023
ENG vs SL World Cup 2023 : ఇంగ్లాండ్‌కు మరో షాక్..శ్రీలంక చేతిలో ఓటమి.. సెమీస్ నుంచి ఔట్!
Glenn Maxwell World Cup 2023 : మ్యాక్స్‌వెల్ ఆటంటే అంతే.. దెబ్బకు మైదానం షేక్..