Dhoni Jersey No 7 : బీసీసీఐ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న ధోనీ జెర్సీ నంబర్ 7ను రిటైర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఇకపై ఈ నెంబర్‌తో టీమ్ఇండియాలో మరో జెర్సీ ఉండదు. అంతే కాకుండా మరే భారత క్రికెటర్ ఈ నెంబర్ జెర్సీని వేసుకోకూదడు. అయితే ఇప్పటి వరకు ఈ గౌరవం సచిన్ టెండుల్కర్‌కు మాత్రమే దక్కింది. సచిన్ జెర్సీ నంబర్ 10ను రిటైర్ అవుతున్నట్లు గతంలో బీసీసీఐ ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'జెర్సీ నెంబర్ 7'కి ఈ గౌరవం దక్కింది.
"ఎంఎస్ ధోనీ ఏడో నంబర్ జెర్సీని ఇకపై ఎవరూ ఎంపిక చేసుకోవద్దని ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లకు చెప్పాం. భారత క్రికెట్‌కు ఎనలేని గుర్తింపు తెచ్చిన మహీ జెర్సీకి వీడ్కోలు పలకాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం అందుకు కారణం. ఇకపై కొత్త ఆటగాళ్లు నెంబర్ 7 జెర్సీని ధరించలేరు. ఇప్పటికే 10వ నంబర్ జెర్సీని పక్కన పెట్టేశాం. ప్రస్తుతం ప్లేయర్ల కోసం 60 సంఖ్యలు ఉన్నాయి. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా ఏడాదికాలం పాటు జట్టుకు దూరమైతే అతడి జెర్నీ నెంబర్‌ను కొత్తవాళ్లకు ఇవ్వం. అప్పుడు అరంగేట్రం చేసేవాళ్లు 30 నెంబర్లలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
-
MS Dhoni's number 7 Jersey is retired from Indian cricket as a tribute to the legend from BCCI - (Indian Express)#MSDhoni #WhistlePodu pic.twitter.com/7OG0v2kVwB
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">MS Dhoni's number 7 Jersey is retired from Indian cricket as a tribute to the legend from BCCI - (Indian Express)#MSDhoni #WhistlePodu pic.twitter.com/7OG0v2kVwB
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) December 15, 2023MS Dhoni's number 7 Jersey is retired from Indian cricket as a tribute to the legend from BCCI - (Indian Express)#MSDhoni #WhistlePodu pic.twitter.com/7OG0v2kVwB
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) December 15, 2023
ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు. 'ఎమ్ ఎస్ ధోనీ అంతర్జాతీయ స్థాయిలో టీమ్ఇండియాకు సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ తీసుకున్న నిర్ణయం. జెర్సీ నెం.7 అనేది ధోనీ గుర్తింపు, ఈ బ్రాండ్‌కు ఉన్న వ్యాల్యూ తగ్గకుండా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం గర్వించదగినది' అని అన్నారు.
-
#WATCH | Delhi: On cricketer MS Dhoni's jersey being retired by the Board of Control for Cricket in India (BCCI), Rajeev Shukla (Vice-President BCCI) says, “This decision by the BCCI is keeping in mind the contribution of MS Dhoni in national as well as international cricket and… pic.twitter.com/ES84trfdlh
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi: On cricketer MS Dhoni's jersey being retired by the Board of Control for Cricket in India (BCCI), Rajeev Shukla (Vice-President BCCI) says, “This decision by the BCCI is keeping in mind the contribution of MS Dhoni in national as well as international cricket and… pic.twitter.com/ES84trfdlh
— ANI (@ANI) December 15, 2023#WATCH | Delhi: On cricketer MS Dhoni's jersey being retired by the Board of Control for Cricket in India (BCCI), Rajeev Shukla (Vice-President BCCI) says, “This decision by the BCCI is keeping in mind the contribution of MS Dhoni in national as well as international cricket and… pic.twitter.com/ES84trfdlh
— ANI (@ANI) December 15, 2023
ధోనీ కెరీర్ విషయానికి వస్తే.. 2020 ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు. కీలక సమయాల్లో తనదైన స్టైల్లో ఆడి జట్టును విజయపథంలో నడిపిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్లోనూ తన జట్టుకు అండగా నిలిచి ఐదవ కప్‌ను అందజేశాడు. మోకాలి గాయం కారణంగా చికిత్స అందుకున్న ధోనీ కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి తన వెకేషన్‌ను ఎంజాయ్ చేశారు. రానున్న ఐపీఎల్‌లోనూ ధోనీ ఆడుతున్నట్లు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ ప్రాక్టీస్‌ను మొదలబెట్టినట్లు తెలుస్తోంది.
బ్లాక్ మెర్సీడీస్లో ధోనీ రైడ్ - ఆ నెంబర్ ప్లేట్‌కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే?
ఫ్రెండ్ బర్త్‌డే వేడుకల్లో ధోనీ హంగామా - అలా చేయడం వల్ల ఫ్యాన్ సస్పెండ్!