ETV Bharat / sports

పాక్ పేసర్​కు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​ - dhoni gifts to pak player

Dhoni Jersey to Pakistani Cricketer: పాకిస్థాన్ క్రికెటర్​​ హారిస్​ రౌఫ్​ను ఆశ్చర్యానికి గురిచేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీ. సంతకం చేసిన తన ఐపీఎల్​ జెర్సీని అతడికి బహుమతిగా పంపించాడు.

Dhoni gifts CSK jersey to Pakistan pacer Haris Rauf

author img

By

Published : Jan 8, 2022, 9:13 AM IST

Updated : Jan 8, 2022, 9:40 AM IST

Dhoni Jersey to Pakistani Cricketer: భారత జట్టు కెప్టెన్లలో ఎంఎస్​ ధోనీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఒక సారథిగానే కాదు.. మైదానంలో గొప్ప వ్యూహాకర్తగా, కీపర్​గా, బెస్ట్​ ఫినిషర్​గా భారత క్రికెట్​ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు​. ఆటతోనే కాకుండా.. మైదానంలో సహచర ఆటగాళ్లు, ఇతర జట్ల క్రికెటర్లతో తాను వ్యవహరించే తీరుతో కోట్లాదిమంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు తన గొప్పమనసు, క్రీడాస్ఫూర్తిని మరోసారి చాటుకున్నాడు. ఈసారి పాకిస్థాన్​ పేసర్​ హారిస్​ రౌఫ్​ను ఆశ్యర్యానికి గురిచేశాడు. సంతకం చేసిన తన ఐపీఎల్​ జెర్సీని అతడికి బహుమతిగా పంపించాడు. ఈ విషయాన్ని రౌఫ్​​ ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

"దిగ్గజం, కెప్టెన్​ కూల్​ ఎంఎస్​ ధోనీ తన అందమైన జెర్సీని బహుమతిగా పంపించాడు. తన మంచి మనుసుతో నంబరు 7 ఇంకా హృదయాలను గెలుచుకుంటున్నాడు" అని రౌఫ్​.. మహీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

రౌఫ్​​ ట్వీట్​కు స్పందించిన సీఎస్కే మేనేజర్ రసెల్​ రాధాకృష్ణన్​.. "మా కెప్టెన్​ మాట ఇచ్చాడంటే.. తప్పక నెరవేరుస్తాడు" అని బదులిచ్చాడు.

Pakistan pacer Haris Rauf tweet
రవూఫ్​ ట్వీట్​

కాగా, ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు ధోనీ. అతడి సారథ్యంలో సీఎస్కే ఇప్పటివరకు నాలుగు ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక టీ 20 ప్రపంచ కప్ 2021 సందర్భంగా టీమ్​ఇండియా మెంటార్​గా వ్యవహరించిన ధోనీ.. పాకిస్థాన్​తో​ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రతర్థి జట్టు ఆటగాళ్లతో కాసేపు ముచ్చటించడం అతడి క్రీడాస్ఫూర్తికి నిరదర్శనం.

ఇదీ చూడండి:

Last Updated : Jan 8, 2022, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.