ETV Bharat / sports

Deepak Chahar: చెన్నైకు షాక్​.. ఐపీఎల్​ నుంచి చాహర్​ ఔట్​..

Deepak Chahar: ఐపీఎల్​లో ఆరంభానికి ముందే చెన్నై సూపర్​ కింగ్స్​కు షాక్​ తగిలింది. కుడి భుజం గాయంతో బాధపడుతున్న దీపక్​ చాహర్​ ఐపీఎల్​లో సగం మ్యాచ్​లకు దూరం కానున్నాడు.

deepak chahar
దీపక్ చాహర్​
author img

By

Published : Mar 2, 2022, 11:11 PM IST

Deepak Chahar: చెన్నై సూపర్​కింగ్స్​కు ఐపీఎల్​ ప్రారంభం కాకముందే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్​ దీపక్​ చాహర్​ గాయం కారణంగా ఐపీఎల్​లో సగం మ్యాచ్​లకు దూరం కానున్నాడు. వెస్టిండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో అతడి కుడిభుజానికి గాయమైంది.

"చాహర్​ ఎనిమిది వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలి. దీనివల్ల అతడు ఐపీఎల్​ 2022 మొదటి దశకు అందుబాటులో ఉండడు."

-బీసీసీఐ అధికారిక వర్గాలు

మార్చి 26 నుంచి ఈ ఏడాది ఐపీఎల్​ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జాతీయ క్రికెట్​ అకాడమీ ఇచ్చే తుది నివేదిక​ కోసం చెన్నై జట్టు ఎదురుచూస్తోంది. ఈసారి జరిగిన మెగావేలంలో చెన్నై జట్టు రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్​ను దక్కించుకుంది. ఈ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడు చాహర్​ కావడం విశేషం.

వెస్టిండీస్​తో మ్యాచ్​లో గాయపడ్డ చాహర్​ శ్రీలంకతో సిరీస్​ నుంచి కూడా వైదొలిగాడు. ఆ సిరీస్​ను భారత్​ 3-0 తేడాతో గెలిచింది.

అంతర్జాతీయ కెరీర్​లో చాహర్​ 20 టీ20 ఆడి 26 వికెట్లు పడగొట్టగా.. 7 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు. బ్యాటింగ్​లోనూ సత్తా చాటిన చాహర్​.. వన్డేల్లో రెండు అర్థశతకాలు సాధించాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో 25% ప్రేక్షకులకు అనుమతి- మార్చి 8న ముంబయికి జట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.