David Warner Pushpa: ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్.. సామాజిక మాధ్యమాల వేదికగా కొత్త కొత్త వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఎక్కువగా టాలీవుడ్ పాటల మార్ఫ్డ్ వీడియోలు పెడుతుంటాడు. తాజాగా యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై విజయం అనంతరం కూడా ఓ వీడియో పోస్ట్ చేశాడు వార్నర్. అల్లుఅర్జున్ 'పుష్ప' సినిమాలోని 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' సాంగ్‌ని మార్ఫ్ చేశాడు. 'కాప్షన్ దిస్' అనే కామెంట్‌ను జోడించాడు.
ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసిన ఈ వీడియోపై టీమ్ఇండియా టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు. 'మేట్ ఆర్ యూ ఓకే(మిత్రమా నువ్వు బానే ఉన్నావా?)' అని విరాట్ కోహ్లీ కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ సైతం ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. క్రికెట్ అభిమానులు కూడా ఈ వీడియోపై భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గతంలో సన్‌రైజర్స్ తరఫున ఆడినప్పుడు వార్నర్ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి తెలుగు సినీ అభిమానులు చాలా దగ్గరయ్యాడు. తర్వాత చాలా పాటలకు మార్ఫ్డ్ వీడియోలు చేశాడు వార్నర్.
ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో వార్నర్ అదరగొడుతున్నాడు. తొలి టెస్టులో 94 పరుగులు చేశాడు. అయితే.. గత ఐపీఎల్లో వార్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కారణం కూడా చెప్పకుండా ఎస్ఆర్హెచ్ అతడిని కెప్టెన్‌గా తొలగించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టుతో కొనసాగే ఉద్దేశంలేదని వార్నర్ నిక్కచ్ఛిగా చెప్పేశాడు. వచ్చే సీజన్ కోసం ఏ జట్టు అతడిని తీసుకోనుందో తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
'రాములో రాములా' అంటూ వార్నర్ చిందులు
'రౌడీ బేబీ' పాటతో.. వార్నర్ ఈజ్ బ్యాక్
ప్రేమించిన వాళ్లే పక్కనపెడితే ఎలా?.. సన్‌రైజర్స్‌పై వార్నర్
David Warner SRH: అయ్యయ్యో వద్దమ్మా.. వార్నర్ రెస్పాన్స్ అదుర్స్!