David Malan Century World Cup 2023 : వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ డేవిడ్ మలాన్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో అతడు 91 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కెరీర్‌లో 6వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 107 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 140 పరుగులు చేశాడు.
ఇంకా ఈ మ్యాచ్‌లో జో రూట్(Joe root World Cup 2023) 68 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు మెరుపులు మెరిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో గ్రాహం గూచ్ పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేశాడు.
ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు
1.జో రూట్- 898*
2.గ్రాహం గూచ్- 897
3.ఇయాన్ బెల్- 718
4.అలన్ లాంబ్- 656
5.గ్రేమ్ హిక్- 635
కాగా, ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. జానీ బెయిర్ స్టో ( 59 బంతుల్లో 52; 8 ఫోర్లు) బాగానే రాణించాడు. జోస్ బట్లర్ (20), హ్యారీ బ్రూక్ (20), సామ్ కరన్ (11) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. లియామ్ లివింగ్‌స్టోన్ (0) డకౌట్ అయ్యాడు. అయితే 26-40 ఓవర్ల మధ్య ఇంగ్లాండ్ బ్యాటర్లు 149 పరుగులు సాధించారు. దీంతో స్కోరు సునాయసంగా 400 దాటేలా కనిపించింది. కానీ, చివరి 10 ఓవర్లలో బంగ్లా బౌలర్లు కాస్త పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్ అనుకున్న దాని కన్నా తక్కువ స్కోరే చేసింది. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు పడగొట్టగా... షారిఫుల్ ఇస్లాం 3 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
-
🚨1️⃣4️⃣0️⃣
— England Cricket (@englandcricket) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The highest ODI score EVER on this ground! 👏
A special knock, Mala 🎉 #EnglandCricket | #CWC23 pic.twitter.com/kKqDFGEQsn
">🚨1️⃣4️⃣0️⃣
— England Cricket (@englandcricket) October 10, 2023
The highest ODI score EVER on this ground! 👏
A special knock, Mala 🎉 #EnglandCricket | #CWC23 pic.twitter.com/kKqDFGEQsn🚨1️⃣4️⃣0️⃣
— England Cricket (@englandcricket) October 10, 2023
The highest ODI score EVER on this ground! 👏
A special knock, Mala 🎉 #EnglandCricket | #CWC23 pic.twitter.com/kKqDFGEQsn