ETV Bharat / sports

వినూ మన్కడ్​ కుమారుడు, మాజీ క్రికెటర్​ కన్నుమూత

Cricketer Rahul Mankad Died: భారత మాజీ క్రికెటర్​ రాహుల్​ మన్కడ్.. గుండె సంబంధిత సమస్యలతో కన్నుమూశారు.​​ ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

cricketer-rahul-mankad-died
cricketer-rahul-mankad-died
author img

By

Published : Mar 30, 2022, 6:43 PM IST

Updated : Mar 30, 2022, 8:45 PM IST

Cricketer Rahul Mankad Died: భారత దిగ్గజ క్రికెటర్​​ వినూ మన్కడ్​ కుమారుడు, మాజీ క్రికెటర్ రాహుల్​ మన్కడ్(66)​ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1972 నుంచి 1985 మధ్య రాహుల్‌.. రంజీల్లో ముంబయి జట్టు తరఫున ఆడారు. 47 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 2,111 పరుగులు సాధించారు. అందులో 5 సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి.

rahul mankad
రాహుల్​ మన్కడ్​

రాహుల్‌ తండ్రి వినూ మన్కడ్‌ టీమ్ఇం​డియా తరఫున 44 టెస్టులు ఆడారు. కేవలం 23 టెస్టుల్లోనే 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌ రికార్డు సృష్టించారు. ఇప్పుడు క్రికెట్‌లో వాడుతున్న మన్కడింగ్‌ పదం కూడా వినూ మన్కడ్‌ పేరు నుంచి వచ్చిందే. ఆయనకు ముగ్గురు కుమారులు కాగా.. ఇప్పటికే అశోక్‌, అతుల్‌ మన్కడ్‌లు మరణించారు. ఆ ఇద్దరు కూడా క్రికెటర్లే. అశోక్‌ మన్కడ్‌ టీమ్​ఇండియా తరఫున 22 టెస్టులు ఆడగా.. అతుల్‌ సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఆడారు.

ఇదీ చదవండి: ICC Rankings: మెరుగుపడిన అశ్విన్​.. మరి కోహ్లీ, రోహిత్?​​

Last Updated : Mar 30, 2022, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.