వెస్టిండీస్‌తో ప్రపంచకప్ 29వ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (148) శతకంతో రెచ్చిపోగా.. రాస్ టేలర్ (69) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్ 4 వికెట్లు తీయగా.. క్రిస్ గేల్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే గప్తిల్ వికెట్ కోల్పోయింది. అదే ఓవర్ ఐదో బంతికి మున్రోను పెవిలియన్ చేర్చాడు కాట్రెల్. అనంతరం వచ్చిన విలియమ్సన్- రాస్ టేలర్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. వీరిద్దరూ 167 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
-
It's been a #KaneWilliamson masterclass today! He's finally dismissed for 148 - his highest ODI score 🙌🏽 A top edge skied and caught by a back-peddling Shai Hope with the gloves 🏏
— BLACKCAPS (@BLACKCAPS) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🇳🇿 253/5 | 47 overs #BACKTHEBLACKCAPS #CWC19 #WIvNZ
LIVE 📱| https://t.co/aU5ayqheAz pic.twitter.com/cTn0EI3uxn
">It's been a #KaneWilliamson masterclass today! He's finally dismissed for 148 - his highest ODI score 🙌🏽 A top edge skied and caught by a back-peddling Shai Hope with the gloves 🏏
— BLACKCAPS (@BLACKCAPS) June 22, 2019
🇳🇿 253/5 | 47 overs #BACKTHEBLACKCAPS #CWC19 #WIvNZ
LIVE 📱| https://t.co/aU5ayqheAz pic.twitter.com/cTn0EI3uxnIt's been a #KaneWilliamson masterclass today! He's finally dismissed for 148 - his highest ODI score 🙌🏽 A top edge skied and caught by a back-peddling Shai Hope with the gloves 🏏
— BLACKCAPS (@BLACKCAPS) June 22, 2019
🇳🇿 253/5 | 47 overs #BACKTHEBLACKCAPS #CWC19 #WIvNZ
LIVE 📱| https://t.co/aU5ayqheAz pic.twitter.com/cTn0EI3uxn
శతకంతో ఆకట్టుకున్న కివీస్ కెప్టెన్..
7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విలియమ్సన్, టేలర్ ఆదుకున్నారు. కేన్ విలియమ్సన్ 154 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. రాస్ టేలర్ అర్ధశతకంతో రాణించాడు. 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గేల్ బౌలింగ్‌లో హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు టేలర్.
గోల్డెన్ డకౌట్లు చేసిన కాట్రెల్..
-
🌴 v 🇳🇿
— Windies Cricket (@windiescricket) June 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Back in after drinks!
NZ 59/2 (16 ov)
Live Scorecard📲: https://t.co/0pVUYZxI77#WIvNZ #MenInMaroon #CWC19 pic.twitter.com/W7PbNX6Seq
">🌴 v 🇳🇿
— Windies Cricket (@windiescricket) June 22, 2019
Back in after drinks!
NZ 59/2 (16 ov)
Live Scorecard📲: https://t.co/0pVUYZxI77#WIvNZ #MenInMaroon #CWC19 pic.twitter.com/W7PbNX6Seq🌴 v 🇳🇿
— Windies Cricket (@windiescricket) June 22, 2019
Back in after drinks!
NZ 59/2 (16 ov)
Live Scorecard📲: https://t.co/0pVUYZxI77#WIvNZ #MenInMaroon #CWC19 pic.twitter.com/W7PbNX6Seq
ఈ ప్రపంచకప్‌లో నిలకడగా వికెట్లు తీస్తోన్న షెల్డాన్ కాట్రెల్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్లను (గప్తిల్, మున్రో) ఔట్ చేశాడు కాట్రెల్. అనంతరం విలియమ్సన్ (148), లాథమ్ (12) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆరంభంలో కివీస్‌ను కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆ తర్వాత పరుగులు ధారళంగా సమర్పించుకున్నారు. కివీస్ బ్యాట్స్‌మెన్‌ల్లో కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. చివర్లో జేమ్స్ నీషమ్ (28) వేగంగా పరుగులు రాబట్టాడు.
ఇది చదవండి: కోహ్లీ ఖాతాలో 52వ అర్ధశతకం.. మరో రికార్డ్ మిస్!