లండన్ వేదికగా భారత్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలవడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ తెలిపాడు. ప్రారంభంలోనే వికెట్లు తీయడం తమకు కలిసొచ్చిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్ 33పరుగులిచ్చి నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
" బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకున్న పిచ్‌పై బంతి కొంచెం స్వింగవడం మాకు కలిసొచ్చింది. బంతి స్వింగ్ అవుతున్నప్పుడే కాకుండా ఏ పరిస్థితుల్లోనైన వికెట్లు తీయడాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అంశంపై దృష్టిపెట్టాం. భారత్‌పై విజయం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే రోజుల్లో ఇలాగే ఆకట్టుకోవాలనుకుంటున్నాం"
- ట్రెంట్ బౌల్ట్ కివీస్ బౌలర్
శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 179 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్ నాలుగు, జేమ్స్ నీషమ్ మూడు వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత బ్యాట్స్‌మెన్‌ల్లో జడేజా మినహా మిగతా వారు పెద్దగా రాణించలేదు. అనంతరం న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.