ప్రపంచకప్ నేపథ్యంలో ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం బుధవారం విరాట్‌కోహ్లీ మైనపు విగ్రహాన్ని లార్డ్స్ మైదానంలో ఆవిష్కరించింది. గురువారం నుంచి జూలై 15 వరకు ఈ విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు.
" కొన్ని వారాల పాటు క్రికెట్ ఫీవర్‌తో దేశం ఉర్రూతలూగిపోనుంది. లార్డ్స్‌లో విరాట్ కోహ్లీ విగ్రహం పెట్టడంకన్నా పెద్ద సంబరం ఉంటుందా.! క్రికెట్ అభిమానులు తమ ఇష్టమైన ఆటగాడిని స్టేడియంలో చూడటమే కాకుండా ఫొటో దిగే అవకాశం కల్పించాం ".
-- స్టీవ్ డేవిస్, మేడమ్ టుస్సాడ్స్ జనరల్ మేనేజర్
లార్డ్స్ మైదానంలోని ఎమ్‌సీసీ మ్యూజియంలో భారతీయ జెర్సీతో కనువిందు చేయనుంది విరాట్ విగ్రహం. దీనికోసం కోహ్లీ తన షూ, గ్లౌవ్స్ ఇచ్చినట్లు వెల్లడించిందీ సంస్థ. గురువారం నుంచి వీక్షకుల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఇప్పటికే ఉసేన్ బోల్ట్, సర్ మో ఫరా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ విగ్రహాలు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి.
ఇవీ చూడండి....