ప్రపంచకప్ తుది ఘట్టానికి చేరుకొంటోంది. సెమీస్‌లో నాలుగో స్థానం కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో లంకకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్ మెగాటోర్నీ నుంచి నిష్క్రమించాడు. చికెన్ పాక్స్ కారణంగా టోర్నీకి దూరమైనట్లు అధికారికంగా పేర్కొంది లంక జట్టు యాజమాన్యం. ఇతడి స్థానంలో కసున్ రజిత్ జట్టులో చేరనున్నాడు.
-
Nuwan Pradeep has been ruled out of the rest of #CWC19 with chickenpox.
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Kasun Rajitha will join the Sri Lanka squad as his replacement. pic.twitter.com/DoN24hjpLM
">Nuwan Pradeep has been ruled out of the rest of #CWC19 with chickenpox.
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
Kasun Rajitha will join the Sri Lanka squad as his replacement. pic.twitter.com/DoN24hjpLMNuwan Pradeep has been ruled out of the rest of #CWC19 with chickenpox.
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019
Kasun Rajitha will join the Sri Lanka squad as his replacement. pic.twitter.com/DoN24hjpLM
7 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. రెండు మాత్రమే నెగ్గి మూడు మ్యాచ్‌లు ఓడింది. మరో రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఫలితంగా 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, భారత్‌తో తలపడనున్న ఈ జట్టు... రెండింటిలోనూ గెలిస్తే సెమీస్‌లో నాలుగో స్థానం కోసం రేస్‌లో ఉంటుంది.